అమ్మవారికి సమర్పించే వస్త్రాలను మహిళలు ధరించవచ్చా?

అమ్మవారికి ఇచ్చిన వస్త్రాలను మహిళలు, పురుషులు, పిల్లలు ధరించకూడదని జ్యోతిష్య పండితులు అంటున్నారు. దేవుని వస్త్రాలను ఆపత్కాలంలో మాత్రమే దానం ఇవ్వాలి. దేవుని వస్త్రాలను మీ తరపున ఇతరులు ధరించేందుకు ఇవ్వరాదట.
నిద్రించే సమయంలో దేవతా వస్త్రాలను ధరించకూడదు. దేవుని వస్త్రాలను పూజా సమయాల్లో మాత్రమే అనగా స్వర్ణగౌరి, వరలక్ష్మి, మంగళగౌరి వ్రతాలు తదితర సమయాల్లో దేవికి అలంకారం చేసేందుకు మాత్రమే ఉపయోగించవచ్చు.
అయితే నూతన వస్త్రాలను దేవాలయం,దేవుని పేరిట కొనుగోలు చేసి వచ్చే పండితులు,పూజారులు ఆశీర్వాదం చేసి ఇస్తే ఉపయోగించుకోవచ్చు. దేవాలయాల్లో దేవుని సన్నిధానంలో జరిగే సభ, సన్మానాల్లో ఇచ్చే వస్త్రాలను ఉపయోగించుకోవచ్చు. దేవుని పేరిట దానం చేసి మిగిలిన వస్త్రాలను ఉపయోగించుకోవచ్చు.
దేవునికి అలంకరించిన వస్త్రాలను దేవాలయం వారు ఆశీర్వదించి ఇస్తే సమర్పించి స్వీకరించాలి. దేవతాకార్యాల్లో దేవునికి నివేదన అయినా లేదా దేవుని ఊరేగింపుల్లో దేవతా వస్త్రాలను ఉపయోగించవచ్చు. హోమంలో ప్రధాన కలశం అలంకరణకు వాడవచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ దేవతా వస్త్రాలను తొక్కకూడదు.
వివాహ సమయంలో మధ్య తెరగా, ఉపనయంలో మంత్రోపదేశానికి వస్త్ర ప్రసాదాన్ని ఉపయోగించకూడదు. ధరించకూడదు.

ఆ వస్త్ర ప్రసాదాన్ని పూజగదిలో భద్రపరచుకోవాలి.

Comments

Popular Posts