ఒకే మంచం పై రెండు పరుపులు వేసుకుని నిద్రించకూడదట.

పడకగదిలో ఒకే మంచం మీద రెండు పరుపులు వేసుకుని శయనించడం అశుభమని ఫెంగ్‌షుయ్ చెబుతోంది.ముఖ్యంగా ఒకే మంచం పై రెండు పరుపులు వేసుకుని శయనించిన దంపతులు కాలానుగుణంగా విడిపోతారని చెబుతున్నారు.

కాబట్టి ఒక మంచంపై ఒకే పరుపును ఉపయోగించడం ద్వారా ఇరువురి మధ్య అన్యోన్యత పెరుగుతుందని ఫెంగ్‌షుయ్ చెబుతోంది. ఇంకా పిల్లలు కలుగని దంపతులు బెడ్‌కి సమీపంలో చిన్న పిల్లలున్న బొమ్మలను గాని, పెయింటింగ్‌గాని వేలాడదీయడం మంచి ఫలితాన్ని ఇస్తుందట.


ముఖ్యంగా దంపతులు శయనించే చోట పై కప్పు మీద దూలం ఉండకుండా చూసుకోవాలి. అలాగే మంచానికెదురుగా టాయ్‌లెట్‌గాని, అద్దాలు గాని, ఎలక్ట్రానిక్ వస్తువులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఫెంగ్‌షుయ్ శాస్త్రం చెబుతోంది. ఇలా చేస్తే దంపతుల మధ్య మంచి అవగాహన, వంశాభివృద్ధి చేకూరుతుందని ఫెంగ్‌షుయ్ నిపుణులు తెలియజేస్తున్నారు.

Comments

Popular Posts