గురుగ్రహ దోష నివారణ

మానసిక, ఆర్థిక ఇబ్బందులు, వ్యాపారంలో అభివృద్ధి లేకపోవడం, సంతానలేమి, వివాహాది కార్యక్రమాల్లో జాప్యం వంటివి జరుగుతుంటే తప్పకుండా గురు భగవానుడికి పూజ చేయాల్సిందేనని జ్యోతిష్యనిపుణులు సూచిస్తున్నారు. గురుగ్రహ దోషంతోనే నిరాశనిస్పృహలు, ఇతరులచే మోసపోవడం ,వ్యాపారంలో నష్టాలు వంటి ఫలితాలు కలుగుతాయి.


వీలైతే గురుగ్రహ దోష నివారణకు తమిళనాడులోని తిరుచ్చెందూరు కుమార స్వామి ఆలయాన్ని దర్శించుకోవడం మంచిది. అలా కుదరని పక్షంలో గురువారం రోజు శెనగలను మాలగా కూర్చి ఆలయాల్లోని గురు భగవానుడికి సమర్పించడం ద్వారా దుష్పలితాల నుంచి విముక్తి లభిస్తుంది. అలానే  గురువారం సాయంత్రం గురు గ్రహం ముందు నేతితో దీపమెలిగించడం, పాలతో గురునికి అభిషేకం చేయించడం ద్వారా శుభఫలితాలు చేకూరుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.

Comments

Popular Posts