ఉపవాసం పాటిస్తున్న రోజుల్లో తలకు మరియు శరిరానికి నూనె రాసుకోకూడదు.ఎందుకు?

రోజంతా ఉపవాసం లేదా రోజులో కొంతభాగం ఉపవాసమును పాటిస్తున్న రోజులలో తలకు మరియు దేహానికి నూనే రాసి స్నానం చేయకూడదు.

నూనె పట్టించి స్నానం చేయడం భారతీయులకు ఆనవాయితి. మరి ఉపవాస రోజులలో ఎందుకు అలా తగదని చెప్పబడింది? దీని వెనుక శాస్త్రీయ కారణం దాగి ఉంది.


శని గ్రహం శక్తి ప్రభావం వల్ల నూనె ఉత్పన్నమైనట్టుగా భావించడం జరిగింది. తలకు నూనె అంటుకోవడం వల్ల తల చుట్లూ ఓ తెజోవలయం ఏర్పడుతుంది.ఈ వలయం ఇతర గ్రహాల నుండి మన శరీరంలోకి ప్రసరించే అయస్కాంత తరంగాలను నిరోదిస్తుంది. కానీ ఉపవాసం పాటించు రోజుల్లో ఇది వేరుగా చెప్పబడింది. ఉపవాస దీక్షను పవిత్ర మనస్సు మరియు శరీరముతో ఆచరించడం జరుగుతుంది. కాబట్టి మన శరీరానికి ఇతర గ్రహాల మరియు నక్షత్రాల నుండి భూమిపైకి ప్రసరించే అయస్కాంత తరంగాల అవసరం ఉంటుంది. తలపై రాసిన నూనె ఈ శక్తి తరంగాలను మనలోకి ప్రసరించకుండా అడ్డుకుంటుంది కాబట్టి ఇలాంటి నియమాన్ని  ఉపవాసముండు రోజులలో ఏర్పాటు చేసారు మన పెద్దలు.

Comments

Popular Posts