కీళ్ళ,మోకాళ్ళ నొప్పుల ఉపశమనానికి చిట్కాలు

చాలా మంది ,ముఖ్యంగా వృద్ధులు కీళ్ళ,మోకాళ్ళ నొప్పులతో చాలా బాధపడుతుంటారు.దీని కోసం ఒక్కొక్కరు ఒక్కో చిట్కా  ఫాలో అవుతారు. కాని కొంతమంది కి తగ్గవు. అలాంటి వారి కోసం కొన్ని శక్తివంతమైన టిప్స్ వున్నాయి. వాటిని ఫాలో అయితే కీళ్ళ నొప్పుల నుంచి ఉపశమనం పొంది మంచి ఫలితాలను పొందవచ్చు.
1. బంగాళ దుంపలను ముక్కలుగా కోసి చల్లని నీటిలో రాత్రంతా నానబెట్టి ,పొద్దున్నే ఆ వాటర్ ను తాగితే కీళ్ళ నొప్పులు మటుమాయమవుతాయట.
2.ఒక టేబుల్ స్పూన్ నల్ల నువ్వులను రాత్రంతా నీటిలో నానబెట్టి తాగితే మంచి ఫలితాలు కనబడతాయి.
3.నిమ్మరసం, తేనే ను గోరు వెచ్చని నీటిలో వేసుకోని తాగడం వల్ల బరువు తో పాటు కీళ్ళ నొప్పుల నుంచి బయట పడతారు.
4.గోరువెచ్చని కొబ్బరి నూనెలో కాసింత కర్పూరం వేసి నొప్పుల వున్న చోట మర్ధన చేస్తే మంచి ఫలితాలు కనబడతాయి.

5.అరటి పండు, కూరగాయల రసం, క్యాల్షియం అధికంగా వున్న పదార్దాలు (పాలు), చేపలు కూడా కీళ్ళ నొప్పుల నుంచి ఉపశమనం కలిగేలా చేస్తాయి.

Comments

Popular Posts