నిమ్మరసం అధికంగా తాగటం వలన కలిగే మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడే ప్రమాదముంది.


విటమిన్ 'C' అధికంగా కలిగి ఉండే నిమ్మ చాలా రకాలుగా ప్రయోజనాలను చేకూరుస్తుందని మనకు తెలుసు.కానీ అతిగా నిమ్మకాయలు/నిమ్మరసం వాడటం వలన కూడా దుష్ప్రభావాలు ఉన్నాయంటున్నారు వైద్యులు.

కడుపులో ఇబ్బందులు:మన జీర్ణాశయంలో అన్ని ఆహార పదార్థాలు జీర్ణం కావు. నిమ్మరసాన్ని ఇతర ఆహార పదార్థాలతో తీసుకోవటం వలన త్వరగా జీర్ణం అవుతుంది కానీ, నేరుగా కేవలం నిమ్మరసాన్ని తీసుకోవటం వలన జీర్ణాశయంలో ఆమ్ల గాడతలు అధికం అవటం వలన జీర్ణాశయంలో అవాంతరాలు ఏర్పడి, కడుపులో ఇబ్బందులకు కారణం అవుతుంది.

అల్సర్:జీర్ణాశయంలో ఆమ్ల గా(అసిడిటీ) అధికం అవటం వలన అల్సర్ లు వస్తాయి.అలాగే ఆమ్ల గాడత కలిగి ఉండే నిమ్మరసాన్ని ఎక్కువగా తీసుకోవటం వలన పొట్టలో ఆమ్ల గాడతలు పెరిగి, జీర్ణాశయ మరియు పేగుల అంతర్గత పొర దెబ్బ తింటుంది. తద్వారా అల్సర్ వస్తుంది.

పిత్తాశయం, మూత్రపిండాలలో రాళ్లు:నిమ్మరసాన్ని తాగటమే కాకుండా వంటలలో కూడా వాడుతుంటారు.నిమ్మ తొక్కలలో ఆక్సాలేట్ అధికంగా ఉంటుంది. నిమ్మకాయని పిండినపుడు ఈ మూలకం కూడా ఆహరం ద్వారా మన శరీరంలోకి చేరుతుంది. ఈ ఆక్సలేట్ మన శరీరంలో కాల్షియం శోషణకు ఆటంకం ఏర్పరచి, పిత్తాశయం, మూత్రపిండాలలో రాళ్లుగా రూపాంతరం చెందుతాయి.

దంత సమస్యలు:నిమ్మరసం లేదా నిమ్మ నేరుగా దంతాలకు తాకటం వలన వాటిలో ఉండే సిట్రిక్ ఆసిడ్ మరియు ఆస్కార్బిక్ యాసిడ్ దంతాల పై పొర అయిన ఎనామిల్ దెబ్బతినేలా చేస్తాయి. ఫలితంగా, క్యావిటీ, దంత కణాలు దెబ్బతినటం లేదా దంతాల రంగు మారటం మరియు దంతక్షయం వంటి సమస్యలు కలుగుతాయి.

Comments

Popular Posts