టూత్ బ్రష్ ఎంతకాలం వాడవచ్చు?ఎంతసేపు బ్రష్ చేయాలి?

ఒక టూత్ బ్రష్ ను కొందరు నెలకు నెలలు వాడుతుంటారు.. కానీ ఒక బ్రష్ జీవితకాలం కేవలం రెండు నెలలు లేదా 200 సార్లు వాడడం మాత్రమే. రెండు నెలల వాడాక బ్రష్ తన శక్తిని కోల్పోతుంది. బ్రష్ పళ్లు సరిగ్గా క్లీన్ చేయలేవు. కనుక ప్రతి రెండు నెలలోకోసారి బ్రష్ ను మారుస్తుండాలి.

రోజుకి ఎంతసేపు బ్రష్ చేయాలి? కనీసం రెండు నిమిషాలైనా చేయాలి అని చెబుతున్నారు నిపుణులు. హడావుడిగా ఇటూ అటూ తోమేసి వెళ్లిపోవడం కాదు. నోరు శుభ్రపడాలంటే రెండు నిమిషాల కన్నా తక్కువ కాకుండా బ్రష్ చేయాలి.

బ్రష్ చేసిన వెంటనే నోట్లో నీళ్లు పోసుకుని పుక్కిలించి ఉమ్మేస్తుంటాం. నోరు శుభ్రంగా కడుక్కుని వచ్చేస్తాం. కానీ బ్రష్ చేశాక... ఆ నురగ అంతా ఉమ్మేశాక ఓ అరగంట పాటూ నీటితో కడగకుండా అలాగే ఉండాలట. అనంతరం నోట్లో నీళ్లు వేసి పుక్కిలించాలట.

బ్రష్ చేశాక దానిని బాత్ రూమ్ లోనే ఒక మూల ఉంచే అలవాటు చాలా మందికి ఉంటుంది. కానీ అది మంచి పద్ధతి కాదంటున్నారు వైద్యులు. కనిపించని క్రియులు చేరతాయట. అందుకే బ్రష్ ను కవర్లో ఉంచి పెట్టడమో, లేక బయట ఎక్కడైనా పెట్టడమో  చేయాలట.

బ్రష్ బ్రిస్సెల్స్ మరీ గట్టిగా ఉన్నవి  కాకుండా కాస్త సున్నితంగా ఉన్నవి వాడాలి. హార్డ్ గా ఉండే బ్రిస్సెల్స్ చిగుళ్లను దెబ్బతీస్తాయి.

ఎక్కువ మంది ఉదయం లేచి బ్రష్ చేశాక... మళ్లీ మరుసటి రోజు ఉదయం వరకు దానిని ముట్టుకోరు. అలా కాకుండా మధ్నాహ్నం భోజనం చేశాక, లేదా రాత్రి డిన్నర్ తిన్నాక కూడా బ్రష్ చేస్తే చాలా మంచిది. మధ్యాహ్నం ఆఫీసుల్లో ఉంటారు కనుక ఎవరికీ కుదరదు. రాత్రి మాత్రం ఖచ్చితంగా పడుకోబోయే ముందు బ్రష్ చేయడం అలవాటు చేసుకోవాలి.


Comments

Popular Posts