అన్నం ఇలా తింటే దరిద్రానికి స్వాగతం చెప్పినట్లే..

కొంతమంది  ఇష్టం వచ్చినట్లు తింటుంటారు. కొంతమంది నిలబడి తింటారు. మరికొంతమంది కూర్చుని టీవీ చూస్తూ భోజనం చేస్తుంటారు. ఐతే భోజనం చేసే కంచం ఛాతీ పైభాగాని కంటే ఎత్తుగా పెట్టుకుని తినరాదు. కొంతమంది భోజనం చేసేటప్పుడు చూస్తే కొంత ఎబ్బెట్టుగా అనిపించినా సందర్బాలు ఉండే ఉంటాయి చాలామందికి. కొంతమంది అన్నాన్ని, కూరను లేదా పెరుగుని కలిపి పిసికేస్తుంటారు. అప్పుడు అన్నం చేతి వేళ్ల మధ్య నుంచి బయటకు వస్తుంటుంది. అలా కలిపి తినడం చూడటానికి అసహ్యమే కాకుండా దరిద్రానికి హేతువు కూడా. కొందరు అన్నం ముద్దలను బఠాణీలు విసురుకున్నట్లు నోట్లోకి విసురుకుంటుంటారు.అది కూడా దరిద్రాన్ని తెచ్చిపెడుతుంది.ఇంకొందరు అన్నం తింటూనే మధ్యలో చేతికి అంటిన అన్నాన్ని వదిలించుకునేందుకు అరచేతిని కంచానికి గీకుతుంటారు, అది దరిద్రానికి హేతువు. 
అన్నాన్ని అరచేయి మొత్తం తగిలేలా కాకుండా, అలాగని మునివేళ్లతోనూ కెలికినట్లుకాకుండా మధ్యస్తంగా కలుపుతూ చక్కగా భోజనం చేయాలి. 

అంతేకాదు భోజనం చేసిన కంచంలోనే చేతిని కడిగేసుకోవడం, దరిద్రానికే హేతువు. కొందరు భోజనం చేస్తుండగానే ఎవరో వచ్చారని గబుక్కున ఎంగిలి చేత్తోనే లేచి వెళతారు. అలా లేవకూడదు. ఒక్కసారి భోజనం దగ్గర్నుంచి లేస్తే ఇక ఆరోజు చేయరాదని శాస్త్రం చెపుతుంది. కనుక భోజనాన్ని శ్రద్ధగా కూర్చుని చేయాలి.

Comments

Popular Posts