ఫలానా సమయానికి ఏ లగ్నం ఉన్నదో తెలుసుకోవడం ఎలా?

               
పంచాంగములో తిథి, వార, నక్షత్రాలు ఇచ్చి నట్లే లగ్నాంతకాలములు అని ఇస్తారు. అవి లగ్నం అంతమయ్యే సమయాన్ని తెలుపుతాయి. 

ఉదాహరణ: జనవరి 19 వ తేదీ ఉదయం 06-26 నుండి 08-14 ని.ల వరకు  మకరలగ్నం ఉందనుకోండి.తరువాత ఏలగ్నం వస్తుంది?మకరం తరువాత కుంభమే  కదా! కుంభలగ్నం ఉంటుంది..

ఏలగ్నంతో రోజు ప్రారంభమౌతుంది అనడానికి లెక్కలేమైనా ఉన్నాయా?
సూర్యుడు ఏరాశిలో ఉంటే ఆ లగ్నంతో రోజు ప్రాంరంభమౌతుంది. తరువాత వరుసగా లగ్నాలన్నీ మారుతూ వచ్చి మళ్లీ సూర్యోదయానికి తిరిగి అదే లగ్నంతో ప్రారంభమౌతుంది.

సూర్యుడు ఎన్ని రోజులు ఒక రాశిలో ఉంటాడు? మళ్లీ ఎప్పుడు వేరే రాశిలోకి మారతాడు?
సూర్యుడు సరిగ్గా ముప్ఫైరోజులు ఒక రాశిలో ఉంటాడు. సాధారణంగా ప్రతీనెలా 14 లేక 15 తేదీలలో రాశి మారుతుంటాడు. దీనినే సంక్రమణము అంటాము. అలాధనురాశిలోకి ప్రవేశించినప్పుడే ధనుస్సంక్రమణం అంటాము.  అప్పుడే ధనుర్మాసం ప్రారంభమౌతుంది. తరువాత నెలకి మకర సంక్రమణం ( సంక్రాంతి పండుగ ) వస్తుంది. 


Comments

Popular Posts