ఎముకలు బలంగా ఉండి,గట్టిపడాలంటే ఈ పానీయం తాగితే తప్పకుండా ఫలితం ఉంటుంది.

మన శరీరంలో ఎముకల నిర్మాణమే అత్యంత కీలకం. ఇవి మన శరీరంలో కదలికలను, శరీర ఆకృతి చక్కగా ఉండేందుకు కీలకంగా వ్యవహరిస్తాయి. శరీరంలోని ఇతర అవయవాలన్నింటికీ రక్షణగా నిలిచేది కుడా ఎముకలే. వయస్సు పెరిగే కొద్దీ ఎముకలు బలహీన పడతాయి. సరైన ఆహారపు అలవాట్లులేక పోయినా ఎముకలు దెబ్బతింటాయి. కీళ్ల నొప్పులతో పాటు, ఆర్థోపెడిక్ సంబంధ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. వీటన్నింటికీ పరిష్కారంగా నిపుణులు ఎముకల బలాన్ని పెంచుకొనేందుకు ఓ పానీయాన్ని సూచిస్తున్నారు. దీనిని 15 రోజులపాటు ప్రతి రోజూ తీసుకొంటే ఎముకలు ఉక్కుకన్నా గట్టిపడతాయనడంలో అతిశయోక్తి లేదంటున్నారు.

ఎముకల పుష్టికి తాగవలసిన పానీయము  తయారు చేసుకోవదానికి  కావలసిన పదార్థాలు :
·        తేనె 2 టేబుల్ స్పూన్లు
·        నువ్వులు 1 టేబుల్ స్పూన్
·        గుమ్మడి విత్తనాలు అర టేబుల్ స్పూన్

తయారీ విధానము:
తేనె, నువ్వులు, గుమ్మడి విత్తనాలను సరైన మొతాదులో తీసికొని గ్రైండ్ చేసుకోవాలి.
·        ఓ కప్పు వేడిపాలలో ఆ మిశ్రమాన్ని కలుపుకుని రోజూ బ్రేక్ ఫాస్ట్ తర్వాత తాగాలి.
·        ప్రతి రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ తర్వాత ఈ మిశ్రమాన్ని తాగాలి.


ఈ మిశ్రమంలో కాల్షియం అధికంగా ఉంటుంది. విటమిన్ డి, ఇతర మినరల్స్ అధికంగా శరీరానికి అందుతాయి. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటంతో ఇన్ఫెక్షన్లు, ఇతర సమస్యలు రాకుండా ఉంటాయి. ప్రయత్నించి చూడండి.

Comments

Popular Posts