వృద్ధాప్యంలో వచ్చే మతిమరువుకు వంటింటి వైద్యం

ఎవరికైనా వృద్ధాప్యంలో మతిమరువు రావడం సర్వసాధారణం. వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపు అల్జీమర్స్‌ సమస్య అంటారు. దీనికి ఇప్పటివరకు సరైన మందులు లేవనే చెప్పాలి. కాని ఇటీవలి కాలిఫోర్నియా యూనివర్సిటీ జరిగిన పరిశోధనలు కొత్త అంశాలు వెలుగుచూశాయి. మన వంటింట్లోనే దానికి ఔషధాలు ఉన్నాయంటున్నారు. అవే మన వంటింటి పదార్థాలైన కరివేపాకు, పసుపు. ఇవి వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపు సమస్యకు మంచి ఔషధాలు అంటున్నారు నిపుణులు.
మతి మరువు సమస్యకు కారణం మెదడులో అమిలాయిడ్‌ బీటా అనే ప్రొటీన్‌ పెరగడమే. కరివేపాకు, పసుపు ఈ ప్రొటీన్‌ పెరుగుదలను అడ్డుకుని తగ్గిస్తుంది. కరివేపాకు శరీరంలో వ్యాధినిరోధక శక్తికి కారణమైన మాక్రోఫేజ్‌ కణాలను మెరుగుపరచి శక్తివంతం చేస్తుంది. ఈ కణాలు మతిమరుపుకు కారణమైన అమిలాయిడ్‌ బీటా ప్రొటీన్లను తొలగిస్తుందని పరిశోధనలో తేలింది. ఈ సమస్య ఉన్న రోగుల రక్తం, కరివేపాకుతో చేసిన ప్రయోగంలో అమిలాయిడ్‌ బీటా ప్రొటీన్‌ తగ్గిపోవడం పరిశోధకులు గమనించారు. అంతేకాక పసుపు, కరివేపాకుల వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు.

Comments

Popular Posts