ఇంటి ఆవరణలో బావి ఎక్కడ తవ్వుకోవాలి? ఎక్కడ తవ్వకూడదు...?

ఇంటి నిర్మాణంలో బావి తవ్వడం కుడా ఒక ముఖ్యమైన అంశం. సరైన దిశలో బావి తవ్వకం చేపడితే ఆ ఇంటిలో నివాసముండే వారికి సకల సంపదలు చేరువవుతాయని వాస్తు శాస్త్రం పేర్కొంటుంది. తూర్పు ఈశాన్యంలో బావులు తవ్వుకోవడం వల్ల సకల సంపదలు వనగూరుతాయని వాస్తు నిపుణులు చెపుతున్నారు. అలాగే కొన్ని దిశల్లో బావి తవ్వకం సరైంది కాదని వాస్తు వెల్లడిస్తోంది.
   
తూర్పు- ఆగ్నేయ భాగంలో బావి తవ్వకూడదని వాస్తుశాస్త్రం చెబుతోంది. ఈ దిశలలో బావి తవ్వినట్లైతే అనారోగ్యాలు, అగ్ని ప్రమాదాలు, ఆర్థిక కష్టనష్టాలు కలుగుతాయి. ముఖ్యంగా ఇంటి యజమానికి తీవ్ర అనారోగ్య బాధలు కలుగుతాయి. ఉత్తర- వాయువ్య దిశలో బావి తవ్వకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఈ స్థలంలో బావి తవ్వినట్లైతే శత్రుహాని, అనారోగ్యాలు ముఖ్యంగా స్త్రీలకు సుఖశాంతులు కరువవుతాయి. మానసిక సంక్షోభం వంటి చెడుఫలితాలు కలుగుతాయని వాస్తునిపుణులు అంటున్నారు. 

పడమర భాగంలోను, పడమర-వాయవ్య, నైరుతి-పడమర దిశలలో కూడా బావి తవ్వకూడదని వాస్తు తెలుపుతోంది. అలా బావి తవ్వకం చేపట్టినట్లైతే... ఆ గృహంలో నివసించువారికి అనారోగ్యాలు, ఆర్థిక కష్టనష్టాలు కలిగి చెడుస్నేహాలు, గౌరవ భంగం కలుగుతుందని వాస్తునిపుణులు తెలుపుతున్నారు.


Comments

Popular Posts