ఆరోగ్యానికి హాని కలిగించని,శక్తివంతమైన దోమల మందును ఎలా తయారు చేసుకోవచ్చు?

ఎలాంటి హాని లేకుండా సహజసిద్ధమైన పదార్థాలతో తయారుచేసిన ద్రవం ద్వారా దోమలను ఎలా చంపవచ్చో తెలుసుకుందాం. కొద్దిగా నీటిని తీసుకొని వేడి చేసి చల్లార్చాలి. ఒక ప్లాస్టిక్ బాటిల్‌ను తీసుకొని రెండుగా కత్తిరించాలి. దాన్నించి కింద భాగం తీసుకొని ముందుగా సిద్ధం చేసుకున్న నీటిని అందులో పోయాలి. ఆ నీటిలో కొద్దిగా చక్కెర, కొంచెం ఈస్ట్ ను వేయాలి. ఈస్ట్ మనకు కిరణా షాపులలో, సూపర్ మార్కెట్లలో, బేకరీలలో దొరుకుతుంది.    
అనంతరం కొంచెం తేనెను ఆ మిశ్రమంలో కలపాలి. ఇప్పుడు ప్లాస్టిక్ బాటిల్ మిగిలిపోయిన రెండో ముక్కను పైభాగాన్ని రివర్స్ చేసి కింద భాగంలో పెట్టాలి. రెండు ప్లాస్టిక్ ముక్కలు కలిసే చోట గమ్‌ లేదా టేప్ తో అంటించాలి.. దీంతో అవి ధృడంగా ఉంటాయి. ఇలా తయారైన ద్రవం నుంచి కార్బన్ డై యాక్సెడ్ విడుదలవుతూ ఉంటుంది. ఇది దోమలను ఆకర్షిస్తుంది. దీంతో దోమలు ఆ ద్రవం వద్దకు వచ్చి, అందులో పడి చనిపోతాయి. ఇలా దోమలను విజయవంతంగా నిర్మూలించవచ్చు. దీన్ని గదిలో ఏదైనా ప్రదేశంలో పెడితే చాలు. ఆ గదిలో ఉన్న దోమలన్నీ అక్కడకు వచ్చి చనిపోతాయి. అయితే ఇది కేవలం కొద్ది రోజులు మాత్రమే పనిచేస్తుంది. చనిపోయిన దోమలతో ఆ బాటిల్ నిండిపోయాక మళ్ళీ అలాగే ద్రవాన్ని తయారుచేసుకొని, పైన చెప్పుకున్నట్లు మరల ఏర్పాటు చేసుకుంటే సరిపోతుంది.

Comments

Popular Posts