ప్రయాణాల్లో వాంతులు కాకుండా ఉండాలంటే ఏం చేయాలి?

కొంతమందికి బస్సు ప్రయాణం పడదు. కడుపులో తిప్పేసినట్లు  అయి వాంతి చేసుకుంటుంటారు. అలాంటివారు ప్రయాణానికి ముందు చిన్న అల్లం ముక్కను బుగ్గన పెట్టుకుంటే వాంతి వచ్చే అవకాశం తగ్గుతుందని వైద్యులంటున్నారు. 


ఇకపోతే అల్లంలో ఉండే క్యాల్షియం, పాస్ఫరస్‌, ఐరన్‌, మెగ్నీషియం, కాపర్‌, జింక్‌ వంటివి మన శరీరానికి ఎంతో అవసరమైన పోషకాలు. ఆకలి వేయకుండా ఉంటే కాస్త అల్లం రసం తీసుకుంటే చక్కగా ఆకలి వేస్తుంది. అలాగే జలుబు, దగ్గు బాధిస్తుంటే అల్లం రసంలో కొద్దిగా తేనె కలిపి తీసుకుంటే త్వరగా ఈ బాధలనుంచి ఉపశమనాన్ని పొందవచ్చని అంటున్నారు వైద్యులు. డికాక్షన్‌లో కొద్దిగా అల్లం, తేనె, తులసి ఆకులను వేసి కలుపుకుని తాగినా కూడా ఈ బాధలనుంచి చక్కటి ఉపశమనాన్ని పొందవచ్చు. కీళ్లనొప్పులను తగ్గించడంలో అల్లం ఎంతో ఉపకరిస్తుంది. కాబట్టి రోజూ కూరల్లో కొంత మోతాదు అల్లం వేసుకుంటే మేలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Comments

Popular Posts