కూరలో ఉప్పు ఎక్కువైతే ఎలా సరిచేయాలి?

కూరలో ఉప్పు ఎక్కువైందని టెన్షన్ పడకండి. అలా కూరలో ఉప్పు ఎక్కువైతే కొద్దిగా కొబ్బరి పాలు జత చేయండి. ఇలా చేయడం ద్వారా ఉప్పు తగ్గి రుచికరంగా ఉంటుంది. పచ్చిబంగాళదుంప తొక్క చెక్కేసి, నాలుగు ముక్కలుగా కోసి కూరలో వేయాలి. వీటిని దాదాపు 10 నిముషాల పాటు అందులో ఉడకనిస్తే ఉప్పు తగ్గిపోతుంది. అయితే వడ్డించే ముందు మాత్రం వీటిని కూరలోంచి బయటకు తీసేయడం మరిచిపోకూడదు. 

ఇంకా రెండు లేదా మూడు కప్పుల పెరుగును కూరలో కలపడం వల్ల ఉప్పు తగ్గడమే కాదు...రుచి కూడా పెరుగుతుంది. ఉప్పు ఎక్కువైన కూరలో ఇదివరికే ఉల్లిపాయ, టమోటో పేస్ట్ వేసినట్లైతే, మరికొంత ఉల్లి టమోటో పేస్ట్‌ను జతచేయవచ్చు. ఇలా చేయడం వల్ల కూరలో ఉన్న ఉప్పు తగ్గడమే కాదు, రుచికరంగా ఉంటుంది. అలాగే గ్రేవీ కూడా ఎక్కువగా ఉంటుంది.
కూరలో ఉప్పు ఎక్కువైతే కాస్త బియ్యప్పిండి కలిపితే సరిపోతుంది.


Comments

Popular Posts