చేతి వేలు పూర్తిగా తెగితే ఏం చేయాలి?చేతి వేలు పూర్తిగా కట్ అయినట్లయితే, ఆ భాగాన్ని శుభ్రంగా కడిగి ప్లాస్టిక్ కవర్‌లో చుట్టి, ఐస్‌కవర్‌లో పెట్టుకుని వీలైనంత త్వరగా ఆస్పత్రికి వెళ్లాలి. ప్రమాదం జరిగిన 6 నుంచి 8 గంటలు లోగా ఆస్పత్రికి చేరుకునేలా చూసుకోవాలి. సరైన సమయంలోగా ఆస్పత్రికి చేరుకుంటే సర్జరీ ద్వారా తెగిన వేలును అతికించే అవకాశం ఉంటుంది.

ఆ గాయాన్ని శుభ్రంగా కడుక్కుని, రక్తస్రావం కాకుండా కట్టు కట్టుకుని ఆధునిక సదుపాయాలున్న ఆస్పత్రికి వెళితే ఉపయోగం ఉంటుంది. అక్కడ వైద్యులు రక్తనాళాల పరిస్థితి ఎలా ఉంది? కండరాలు ఎంత మేరకు కట్ అయ్యాయి? టెండాన్స్ ఎలా ఉన్నాయి? తదితర విషయాలను పరిశీలించి అవసరమైన చికిత్సను అందిస్తారు.


చేయి పూర్తిగా కట్ అయినప్పుడు కూడా సమయంలోగా ఆస్పత్రికి వస్తే ఆపరేషన్ చేసి చేయి పోకుండా కాపాడే వీలుంది. నరం కట్ అయి చేతి స్పర్శ కోల్పోయినపుడు నరాన్ని తిరిగి అతికించడం ద్వారా పోయిన స్పర్శ వచ్చేలా చేయవచ్చు. కండరం బాగా దెబ్బతింటే ఇతర భాగంలో నుంచి కండరం తీసుకుని సర్జరీ ద్వారా అమర్చడం జరుగుతుంది. దీన్ని ఫ్లాప్ సర్జరీ అంటారు.

రొడ్డు ప్రమాదాల్లో గాయపడ్డ వారికి చేతులు, కాళ్లు బాగా గీరుకుపోయి ఉంటాయి. లోతైన గాయాలు ఏర్పడతాయి. అటువంటి వారికి ఈ సర్జరీ బాగా ఉపయోగపడుతుంది. ఈ చికిత్సలతో అవయువాలు పనితీరు కోల్పోకుండా కాపాడవచ్చు.

Comments

Popular Posts