ఉదయాన నిద్రలేచేటప్పుడు కుడివైపుకు తిరిగి లేవాలి.ఎందుకో తెలుసా?

నిద్రకు ఉపక్రమించడం, నిద్రలేవడం గూర్చి మన సంప్రదాయం ఎన్నో విషయాలను చెప్పింది. మనం ఉదయాన నిద్రలేచే పద్ధతిని బట్టి రోజులో మనం చురుకుగా లేదా మందకొడిగా ఉండటంపై ప్రభావాన్ని చూపుతుందని మన పాతతరం వారు విశ్వసించేవారు.
                    ఉదయాన నిద్రలేచేటప్పుడు కుడివైపుకు తిరిగి లేవాలని చెప్పబడిన ఋషివాక్కు మన ఆరోగ్యానికి సంబంధించే చెప్పబడింది.నేటి పాశ్చాత్య వైద్యులు సైతం ఈ విషయాన్ని అంగీకరిస్తూ పాటించాల్సిన అంశంగా సూచిస్తున్నారు. 
                         మన శరీరం చుట్టూ రెండు అయస్కాంత వలయాలు ఉన్నాయి. మొదటిది పాదం నుండి తలవరకూ , తల నుండి పాదం వరకు తిరుగుతుంటుంది. రెండవది ఎడమ వైపునుండి కుడికి, కుడివైపు నుండి ఎడమకు మన చుట్టూరా తిరుగుతుంటుంది. అనుకూల దిశగా మన శరీర కదలిక వల్ల రెండవ వలయ ప్రవాహం ప్రభావితమై బలం చేకూరుస్తుంది.
                              ఒకవేళ ఈ రెండు వలయాలు ఒకదానికొకటి విరుద్ధదశలో ఉంటే శరీర యంత్రాంగం బలహీనపడుతుంది. ఈ విషయాన్ని గుర్తించిన ఆధునిక సైన్స్ కుడివైపుకు తిరిగి లేవడం వల్ల వలయ ప్రవాహ బలం పుంజుకుంటుందని తెలుపడం జరుగుతుంది.
                పిల్లలు తమ పనిలో మందకొడిగా ఉన్నట్లయితే ఎడమవైపుకు తిరిగి నిద్రలేచావని పెద్దలు ఈ కారణంగానే మందలిస్తారు.    


Comments

Popular Posts