పంచాంగము అంటే ఏమిటి?

             
జాతక చక్రం వేయాలన్నప్పుడు పరిగణలోకి తీసుకునే మొట్టమొదటి విషయము- ఫలానా సయానికి ఏ తిథి, వార, నక్షత్రాలు ఉన్నాయో తెలుసుకోవడం.. చాలా మందికి ఈ విషయం చిన్నప్పటి నుండే తెలిసి ఉంటుంది. ఈ తరం వారికి కూడా అర్ధం కావాలనే ఈ చిన్న వ్యాసం  ఫలానా సమయానికి ఏ తిథి, వార, నక్షత్రాలు ఉన్నాయో తెలుసుకోవడం ఎలాసమాధానం చాలా తేలికైనది. మన తెలుగు కాలెండర్ లో,పంచాంగాలలో ఉంటాయి ఇవన్నీ. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు అను ఐదు ( పంచ ) విషయాల ( అంగాల ) గురించి వివరించునదే "పంచాంగము". మన ఆంధ్రులు చంద్రుని బట్టి లెక్కలు వేస్తారు. కనుక మనది చాంద్రమానము.
   సరే ఈ పంచాంగములలో కూడా అనేక రకాలు ఉన్నాయి. అందులో ప్రధానమైనవి గంటల పంచాంగము, ధృక్ ( సూర్య ) సిద్ధాంత పంచాంగము.  పూర్వంనుండీ వాడేవి గంటల పంచాంగము. కానీ సరిఅయిన లెక్కలు వచ్చునవి, జ్యోతీష్యులు అంగీకరించునవి ధృక్ సిద్ధాంత పంచాంగములని కొందరి భావన.  తిథి, నక్షత్రాలు ఎప్పుడు ప్రారంభమౌతున్నాయి, ఎప్పుడు పూర్తవుతున్నాయి అనే విషయాలలో ఈ రెండు పంచాంగము లకు వ్యత్యాసాలు ఉన్నాయి.

పంచాంగములో ఫలానా తేదీ నాడు ఏ తిథి, నక్షత్ర, యోగ, కరణములు ఎంతవరకు ఉన్నదీ అనే విషయం ఉంటుంది. సాధారణంగా అన్ని పంచాంగములలోనూ ప్రారంభ సమయాలు కాక, అంత్య సమయాలు ఇస్తారు.  ఇక వారం విషయం అందరకూ తెలిసినదే! కానీ ఆంగ్ల మానము ప్రకారం అర్థ రాత్రి 12 నుండి మళ్లీ అర్థ రాత్రి 12 వరకు వారము కాదు. సూర్యోదయము నుండి మరల సూర్యోదయము వరకు ఒకటే వారముగా గ్రహించాలి.  అలాగే తిథిని గ్రహించేటప్పుడు పూజలో సంకల్పానికి అయితే సూర్యోదయానికి ఏ తిథి ఉంటే అదే తిథిని చెబుతారు. కానీ ముహూర్త నిర్ణయానికి అయితే ఆసమయానికి ఏది ఉంటే అదే పరిగణిస్తారు..

Comments

Popular Posts