పుట్టిన సమయాన్ని బట్టి జాతకం ఎలా వుంటుందో తెలుసా?

 
మనదేశంలో జాతకం చూసేటప్పుడు పుట్టిన సమయానికి చాలా విలువిస్తారు. ఎందుకంటే దీని మీదే వారి భవిష్యత్ ఆధారపడి వుందని మన నమ్మకం.అలాగే వివాహా సమయంలో కూడా దీనికి చాలా ప్రాముఖ్యత వుంది. ఇప్పటి వరకు చాలా మంది మన పుట్టిన సంవత్సరం బట్టి లేదా ,మనం పుట్టిన నెల, తేది బట్టి జాతకం చెప్పేవారు. ఈప్పుడు కచ్చితమైన సమయాన్ని బట్టి మీ జాతకం ఇలా ఉంటుందని జ్యోతిష్యులు సెలవిస్తున్నారు.

ఉదయం 12 నుంచి 2 గంటల మధ్య :
ఈ సమయంలో పుట్టిన వారికి వుండేవి. అధిక తెలివి,సాహాసం చేయాలనే తపన, ట్రావెలింగ్ పై ఆసక్తి,సామాజీక జీవితపు ప్రభావం.
ఉదయం 2 నుంచి 4 గంటల మధ్య :
పుడ్ ఇండస్ట్రీలో రాణిస్తారు. చెఫ్ గా సెటిల్ అయ్యే ఛాన్స్ ఎక్కువ.
ఉదయం 4 నుంచి 6 గంటల మధ్య :
అనారోగ్య సమస్యలు,కష్టానికి తగ్గ ఫలితం అందుతుంది,ఫ్యూచర్ చాలా బ్రైట్ గా వుంటుంది.
ఉదయం 6 నుంచి 8 గంటల మధ్య :
వీరికి లక్ ఫుల్ గా వుంటుంది. కొంచెం ఎక్సెపెక్ట్ చేస్తే తిరిగి ఊహించని రీతిలో పొందుతారు. ప్రశాంతం గా వుంటారు.
ఉదయం 8 నుంచి 10 గంటల మధ్య :
వీరి జీవితంలో డబ్బు చాలా కీలకం. ఫ్రెండ్స్, రిలేషన్స్ ఏది మెయినెటేయిన చేయలాన్న డబ్బు అవసరం.
ఉదయం 10 నుంచి 12 గంటల మధ్య :
వీరి సక్సెస్ శాతం ఎక్కువ. వీరికి తమకొచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే చాలా వరకు సక్సెస్ అవుతారు.
మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల మధ్య :
వీరి ఉద్యోగం ట్రావెలింగ్ తో ముడి పడి వుంటుంది. వీరు చాలా అందంగా, షార్ప్ మైండ్ తో వుంటారు. జాలి,దయ కాసింత ఎక్కువే.
మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల మధ్య :
వీరు మంచి ఉద్యోగాలలో సెటిల్ అవుతారు. శాసించే లెవల్లో  వుంటారు.
సాయంత్రం 4 నుంచి 6 గంటల మధ్య :
వీరికి బాధ్యతలు ఎక్కువ.పెళ్లి తర్వాత అవి మరీ ఎక్కువగా వుంటాయి. వీరు విజయాల కోసం చాలా కష్టపడాలి.
సాయంత్రం 6 నుంచి 8 గంటల మధ్య :
వీరు ఫ్రెండ్స్ కి చాల విలువ ఇస్తారు. సోషల్ యాక్టీవిట్స్ లో ఎక్కువగా పాల్గొంటారు.
రాత్రి 8 నుంచి 10 గంటల మధ్య :
వీరికి క్రియేటివ్ టాలెంట్,స్కిల్స్ ఎక్కువ. వీరికి వారి అభిరుచి తగ్గ జాబ్ లో సెటిల్ అవుతారు.విజయంతో గుర్తింపు పొందుతారు. ఇతరుల సలహాల వల్ల ప్రమాదంలో పడే అవకాశం ఎక్కువ.
రాత్రి 10 నుంచి 12 గంటల మధ్య :
వీరికి సంపద, ఆస్తి తక్కువగా వుంటాయి. అవి పొందడానికి కూడా చాలా కష్టపడాలి. రియల్ ఎస్టేట్ లో బాగా రాణిస్తరు. వీరి జీవితంలో అన్ని ఫలితాలు కారణం వీరే. వేరోకరి హాస్తం వుండదు.


Comments

Popular Posts