రాహు దోషం ఉన్నవారు,వివాహం అవడంలో ఇబ్బంది పడేవారు, సంతానం కలుగని వారికి ...పండితులు సూచిస్తున్న సులభమైన పరిహారము.

దృష్టి దోషములు, గ్రహ దోషములు, అననుకూలతల వల్ల అనుకున్న పనులు, శుభకార్యాలు జరుగవని పండితులు చెబుతారు.

అందువలన రాహు దోషమున్నవారు, కుజ దోషం వున్నవారు, శత్రువుల బెడద ఎక్కువగా వున్నవారు, వివాహం జరుగక ఇబ్బందిపడేవారు, సంతానం కలుగని వారు ఆదివారం రోజు సాయంత్రం 4.30 గంటల నుంచి సాయంత్రం 6.00 గంటల వరకూ, సోమవారం నాడు ఉదయం 7.30 గంటల నుంచి 9.00 గంటల వరకూ, శనివారం రోజు ఉదయం 9.30 గంటల నుంచి 11.00 గంటల వరకు రాహు కాలంలో నిమ్మకాయ డొప్పలో అష్టమూలిక తైలంతోగానీ, నవమూలిక తైలంతోగాని లేదా నువ్వుల నూనెతో గానీ దీపారాధన చేసిన విశేష ఫలితములు కనిపిస్తాయని వారు చెబుతున్నారు.ఈ సమయంలో దుర్గా అష్టోత్తరము, సుబ్రహ్మణ్య అష్టకము పఠనం చేయాలి. ఇలా చేస్తే దోషములు పోయి గ్రహాల అనుకూలత వల్ల శుభం కలుగుతుందట.

Comments

Popular Posts