అశ్లీల చిత్రాలు చూస్తే నిజంగానే కళ్ళు పోతాయట!

రోజుల్లో అశ్లీల చిత్రాలు, బూతు సాహిత్యం..అతి తేలికగా లభ్యమైపోతోంది. ఇంటర్నెట్ లో ధారాళంగా డౌన్ లోడులూ, అప్ లోడులూ జరిగిపోతాయి. అంతేకాదు యువత చేతిలో స్మార్ట్ ఫోనులు కుడా వీటిని మరింత ఎక్కువ చేస్తున్నాయి.వయసు రాకుండానే వెబ్ సైట్లు తెరచి తహ తహ లాడుతూంటారు. 

పెళ్ళి కాని వారు రతికార్యాలపట్ల ఆసక్తికొరకు చూస్తే, పెళ్ళి అయినవారు, అనుభవాలు రుచిచూసినవారు సైతం వారి రతిని మరింత మెరుగులు పెట్టుకొని అధిక ఆనందంకొరకు వాటిని చూస్తుంటారు. చివరకు రతి క్రీడ చేయటంకన్నా చూడటంలోనే అధిక ఆనందం పొందే వారు కూడా లేకపోలేదు. మరి సమాజం తీరు లైంగిక జీవితాల పట్ల ఈ విధంగా వుంటే ఈ అంశంపై రీసెర్చి చేసిన రీసెర్చర్లు ఏమంటున్నారో పరిశీలించండి. 


తాజాగా చేసిన ఒక అధ్యయనంలో, బూతు బొమ్మలు గాఢంగా చూస్తూ వుంటే ఫలితంగా కను గుడ్డుకు రక్తప్రసరణ తగ్గి కనుచూపు మందగిస్తుందని చెపుతున్నారు. తద్వారా బూతు  చిత్రాలు చూడటం చివరకు గుడ్డితనానికి దారి తీస్తుందని నెదర్లాండ్ దేశంలోని గ్రోనిజెన్ మెడికల్ సెంటర్ మరియు యూనివర్శిటీ లోని యూరో న్యూరాలజిస్టు డా. గెర్ట్ హోల్ స్టేజ్ వెల్లడించారు. ప్రత్యేకించి మహిళల కనుచూపు త్వరగా మందగిస్తుందట.దానికి కారణం బూతు సినిమా చూస్తున్నపుడు మహిళ కళ్ళలో సెక్స్ కోరికలు రాకముందే పూర్తి ఆందోళన ప్రభావమేనని కూడా వీరు చెపుతున్నారు. రీసెర్చిలో భాగంగా రీసెర్చర్లు డజను మందికి వరుసగా ఒక మాదిరినుండి తీవ్ర లైంగిక చర్యలున్న అశ్లీల చిత్రాలు చూపారు. వారి మేదళ్లను  పిఇటి అంటే పొసిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ లతో స్కానింగ్ చేశారు. దాంట్లో మహిళల కనుగుడ్డుకు రక్తప్రసరణ గణనీయంగా తగ్గిపోవటాన్ని గమనించారు. ఇది తీవ్రంగా సెక్స్ జరిపే చిత్రాలు చూస్తున్నపుడు మరింత అధికంగా రక్తప్రసరణ తగ్గడం గమనించారట. 


మరి ఇదే రీతిలో అశ్లీల చిత్రాలు చూడటం కొనసాగితే, అతి త్వరలో ఎంతో మందికి కంటిచూపు సమస్యలు వచ్చే ప్రమాదం వుంది. కనుక ఆనందం సంగతి ఎలా వున్నా, నయనం ప్రధానం అన్నారు కనుక, వీటిని చూసే ముందు ఈ విషయాన్ని మననం చేసుకోవాలి.

Comments

Popular Posts