మన ఆచారాల వెనుక శాస్త్రీయత (Science behind our customs and rituals)

మన ఆచారాలను ఈ తరంవారు మూడనమ్మకాలు,చాదస్తం అని కొట్టిపారేస్తారు.కాని కొందఱు ఇప్పటికీ వాటిని పాటిస్తూనే ఉంటారు.కొందఱు విదేశీయులు కుడా మన ఆచారాలలో సైన్సు దాగి ఉందని,వాటి వెనుక చాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని  మన ఆచారాలను గౌరవిస్తున్నారు.అలంటి మన ఆచారాల వెనుక ఉన్న శాస్త్రీయత ఏమిటో తెలుసుకుందాము.

ఆల‌యాల్లో గంట‌లు ఉండ‌డం......

ఆల‌యాల్లో ఉండే గంట‌ను ఏడు సార్లు కొడితే మ‌న శ‌రీరంలో ఉన్న ఏడు చ‌క్రాలు ఉత్తేజం అవుతాయి. అంతేకాదు మెద‌డు కుడి, ఎడ‌మ భాగాలు రెండూ కొంత సేపు ఏక‌మ‌వుతాయి.. దీంతోమ‌న మ‌న‌స్సుకు ప్రశాంతత క‌లుగుతుంది. తద్వారా ఏకాగ్రత పెరుగుతుంది. గంట‌ను మోగించ‌డం వ‌ల్ల ఆ ప్రాంతంలోని గాలిలో ఉండే క్రిములు నాశ‌న‌మ‌వుతాయ‌ట‌.

ఆడ‌వారు గాజులు ధరించ‌డం వెనుక.......
ఆడ వారు గాజులు ధరించడం వెనుక అర్థముందంటున్నారు పండితులు. ఆ గాజుల వ‌ల్ల అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయ‌ని చెబుతున్నారు. గాజులు ఎల్లప్పుడు చేతి న‌రాల‌కు తాకుతూ ఉండ‌డం వ‌ల్ల బీపీ కూడా కంట్రోల్‌లో ఉంటుంద‌ట‌.

పిల్లలకు చెవులు కుట్టించ‌డం.....
చిన్నారుల‌కు చెవులు కుట్టించ‌డం స‌హ‌జ‌మే. ప్రధానంగా ఆడపిల్లలకు, ఆ మాట‌కొస్తే కొంత మంది మ‌గ పిల్లలకు కూడా చెవులు కుట్టిస్తారు. ఇలా కుట్టించ‌డం ఆక్యుప్రెష‌ర్ వైద్యంలో ఒక భాగం.దాని వల్ల కొన్ని రకాల  అనారోగ్యాలు పోతాయి. అంతేకాకుండా అస్తమా వంటి వ్యాధులు రావు.

రావి చెట్టును పూజించ‌డం.....
హిందువుల్లో అధిక శాతం మంది రావి చెట్టుకు పూజ‌లు చేస్తారు. ఈ చెట్లు ఎక్కువ‌గా దేవాల‌యాల్లోనే ఉంటాయి. అయితే సాధార‌ణంగా చెట్లన్నీ ప‌గ‌టి పూట ఆక్సిజ‌న్‌ను విడుద‌ల చేస్తే ఈ చెట్టు మాత్రం రాత్రి పూట ఆక్సిజ‌న్‌ను విడుద‌ల చేస్తుంద‌ట‌. రావి చెట్టుకు పూజలు చేయడం వల్ల మంచి జరుగుతుందని, అందుకే రావి చెట్టును పూజిస్తారు.

కాలి వేళ్ళకు మెట్టెలు ధ‌రించ‌డం.......
హిందూ సంప్రదాయంలో పెళ్ళైన మ‌హిళ‌లు కాలికి మెట్టెల‌ను ధ‌రిస్తారు. ఇలా ధ‌రించ‌డం వ‌ల్ల ఆక్యుప్రెష‌ర్ వైద్యం జ‌రిగి వారి గుండె నుంచి గ‌ర్భాశ‌యానికి ర‌క్త ప్రసరణ బాగా జ‌రుగుతుంది. అయితే వెండి మెట్టెలు ధ‌రిస్తే ప్రకృతిలో ఉన్న పాజిటివ్ ఎన‌ర్జీ వారి శ‌రీరంలోకి ప్రవేశిస్తుందని చెబుతారు.

నిద్రించేట‌ప్పుడు త‌ల‌ను ఉత్తరానికి పెట్టకపోవడం.....
భూమికి అయ‌స్కాంత క్షేత్రం ఉన్నట్టుగానే మ‌న శ‌రీరానికి కూడా అయ‌స్కాంత క్షేత్రం ఉంటుంది. ఒక వేళ మ‌నం ఉత్తరం దిశ‌గా త‌ల‌ను పెట్టి ప‌డుకుంటే మ‌న శ‌రీరంలో ఉన్న ఐర‌న్ మెద‌డుకు ప్రవహించి  బీపీ, గుండె సంబంధ సమస్యలు వ‌స్తాయి.త‌ల‌నొప్పి, అల్జీమ‌ర్స్‌, పార్కిన్‌స‌న్స్ డిసీజ్ వంటి వ్యాధులు వ‌స్తాయ‌ట‌. కాబ‌ట్టి త‌ల‌ను ఉత్తరం దిశ‌కు పెట్టి నిద్రించ‌కూడదని నిపుణులు సూచిస్తున్నారు.

నుదుట‌న కుంకుమ బొట్టు ధ‌రించ‌డం....
హిందువులు నుదుట‌న కుంకుమ బొట్టును ధరిస్తారు. అలా ధరించినట్లయితే అక్కడి న‌రాలు ఉత్తేజిత‌మై పీయూష గ్రంథిని యాక్టివేట్ చేస్తాయి. దీంతో బీపీ, ఒత్తిడి, ఆందోళ‌న వంటి సమస్యలు త‌గ్గుముఖం ప‌డ‌తాయ‌ట‌. పెట్టుపెట్టుకోవడం వల్ల ఇతరుల దృష్టి బొట్టుపై పడటంతో ఎలాంటి సమస్యలు రావని చెబుతుంటారు.

పెద్దవారికి చేతులు జోడించి రెండు చేతులతో నమస్కరించడం ....
ఎదురుగా ఉన్న వారికి రెండు చేతుల‌తో నమస్కరిస్తే మ‌నం వారిని ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటామ‌ట‌. ఎలాగంటే రెండు చేతుల‌ను జోడించిన‌ప్పుడు చేతి వేళ్ళన్నీ  క‌లిసిపోయి ఆక్యుప్రెష‌ర్ వైద్యం జ‌రిగి మ‌న జ్ఞాప‌క‌శ‌క్తిని పెంచుతుంది. దీంతో పాటు మెద‌డు ప‌నితీరు కూడా మెరుగు ప‌డుతుంది.

నేల‌పై కూర్చుని భోజ‌నం చేయ‌డం.....
నేల‌పై కూర్చుని భోజ‌నం చేయ‌డం వ‌ల్ల ప‌ద్మాస‌నం భంగిమ వ‌స్తుంది. దీంతో జీర్ణక్రియ సక్రమంగా  జ‌రిగి జీర్ణాశ‌య సంబంధ సమస్యలు దూర‌మ‌వుతాయని చెబుతున్నారు.

న‌దుల్లో నాణేలు వేయ‌డం....
మన పూర్వీకుల కాలంలో రాగితో చేసిన నాణేలు చ‌లామ‌ణీలో ఉండేవి. ఆ నాణేల‌ను న‌దుల్లో వేస్తే ఆ రాగి అంతా ఆ నీటిని శుద్ధి చేసేద‌ట‌. దీంతో ఆ నీటిని తాగేవారికి ఎన్నో అనారోగ్యాలు దూరం అయ్యేవట .అది క్రమేణా ఆచారంగా మారింది.ఇప్పటికీ కొందఱు రాగి పాత్రల్లోనే నీటిని తాగుతూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు.

ఉప‌వాసం ఉండ‌డం.....

హిందువుల్లో అధిక శాతం మంది వారంలో ఏదో ఒక రోజు దేవుడికి ఉప‌వాసం ఉంటారు క‌దా. ఆయుర్వేద ప్రకారం అలా ఉప‌వాసం ఉండ‌డం చాలా మంచిది. ఎందుకంటే ఉప‌వాస స‌మ‌యంలో మ‌న జీర్ణవ్యవస్థకు పూర్తిగా విశ్రాంతి ల‌భించి శ‌రీరంలో ఉన్న ప‌లు విష ప‌దార్థాలు బ‌య‌ట‌కు వెళ్ళగొట్టబ‌డ‌తాయి.దీంతోపాటు దేహం త‌న‌కు తాను మరమ్మతులు చేసుకుంటుంద‌ట‌. ఉప‌వాసం ఉండ‌డం వ‌ల్ల డ‌యాబెటిస్‌, గుండె జ‌బ్బులు, కాన్సర్, బాక్టీరియా  ఇన్ఫెక్షన్స్ రావు.

Comments

Popular Posts