తీర్ధం పరమౌషధం.సాధారణముగా తీర్ధం లో తులసి,పచ్చకర్పూరం ఉపయోగిస్తారు. పచ్చ తులసికి ఓ ప్రత్యేకత ఉంది. కొడిగడుతున్న శక్తులకు పునరుజ్జీవాన్ని తెచ్చే లక్షణం దీనికుంది. చనిపోతున్న వాళ్ల నోట్లో తులసి తీర్థం వేయడం వెనుక ఉన్న మర్మం కూడా ఇదే. తులసి తీర్థాన్ని కూడా ఉద్ధరిణి సాయంతో సవ్యదిశలో తిప్పుతూ ఉండటాన్ని గమనిస్తాం. ఇక్కడా వర్తులాకార తరంగాల శక్తి ప్రవహిస్తూ ఉంటుంది. ఇందులో ఉండే పచ్చకర్పూరం, యాలకులకు మనసుకు ఉత్తేజం కలిగించే గుణం ఉంటుంది. పచ్చకర్పూరానికి దేన్నైనా పాడవకుండా ఉంచే లక్షణం ఉంటుంది. నిజానికి అదో ప్రిజర్వేటివ్‌. తిరుపతి లడ్డూలో పచ్చకర్పూరం వేయడం వెనుకా కారణం ఇదే. ఇక, ఇందులో భగవంతుడి అనుగ్రహమూ దాగుంది. భగవంతుని పేరు చెబుతూ అరచేతిని పదార్థాలవైపు చూపుతున్నప్పుడు మన అరచేతుల నుంచి బంగారు రంగు కిరణాలు వెలువడతాయన్నది ప్రాణిక్‌హీలింగ్‌లో చెబుతారు. దేవుడికి నైవేద్యంగా సమర్పించిన ఏ పదార్థానికైనా అంత రుచి రావడం వెనకున్న రహస్యం ఇది.
Image 

Comments

Popular Posts