‘ఓం’ కారం-సర్వ వేద సారం.

ఓం  హిందూ సంప్రదాయంలో అత్యంత ప్రాధాన్యం ఉన్న శబ్దం. హిందూ మతానికి సంబంధించిన ఏ పుస్తకమైనా, ఏ మంత్రమైనా ఈ శబ్దంతోనే ప్రారంభమై ముగుస్తుంది.ఆన్ని మంత్రాలోకి శక్తివంతమైన ఏకాక్షర మంత్రం ఓం:'. దీనినే ప్రణవమని అంటారు. మంత్రోచ్ఛారణ జీవునికి, పరమాత్మ అనుగ్రహాన్ని సులభతరం చేసే సాధనం. సనాతనమైన హిందూ ధర్మమునందు ఓంకారానికి అత్యంత ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఉంది. సర్వశ్రేష్ఠుడైన భగవంతునికి ఆకారరూపం(నామ),నాదరూపం,ప్రణవనాదము,ప్రధమ నామము, పరబ్రహ్మ స్వరూపము-ఈ ఏకాక్షరమైన ఓంకారము.  ఓంకారం నుంచే యావత్తు జగము ఉద్భవించింది. వేదముల యొక్క సారము ఓంకారం. బ్రహ్మనాదము ఓం కారం.

అకార, ఉకార, మకారములను మూడు అక్షరంల కలయిక వలన ఓంకారం ఉద్భవించినది. ఓం, ఓమ్, లేదా ఓంకారం త్రిమూర్తి స్వరూపముగా చెప్పబడుతోంది. ఓం కారం శభ్ధాలలో మొదటిది. భగవంతుని ముఖ్యనామమైన ఓం'కు అనేక అర్థాలు కలవని ఋషులు తెలియజేశారు.

ఓంకారం హిందూమతానికి కేంద్ర బిందువు, పరమాత్మకు శబ్దరూప ప్రతీక. దీనికి నాలుగు పాదాలున్నాయి. అందులో అకారం జాగృదావస్థకు, ఉకారం స్వప్నావస్థకు, మకారం సుషుప్తావస్థకు శబ్దరూప ప్రతీకలు. వాటికి అతీతమైన తురీయావస్థకు ప్రతీక శబ్దరహితమైన ఓంకారం. దాన్ని గ్రహించినవాడు తనను పరమాత్మతో ఏకం చేసుకోగలడు. శబ్దమే భగవంతుడని చెప్పబడింది. ప్రతి పదమునకు మూలాధారముగా ఒక గుర్తుగా ఉంటే అది ఉత్తమోత్తమ చిహ్నం అవుతుంది. శబ్దోచ్చారణలో మనం కంఠంలోని స్వరపేటికను, అంగిలిని, శబ్ద ఫలకాన్ని ఉపయోగిస్తాం. ఏ శబ్దము నుండి ఇతర శబ్దాలన్నీ వ్యక్తమవుతున్నాయో అలాంటి అత్యంత స్వాభావిక శబ్దము ఏదైనా ఉందా అంటే అదే ప్రణవము లేక ఓంకారం.

, , మ్‌ కలసి ఓంకారం అయింది. నీవు  అన్నప్పుడు ప్రాణశక్తి శరీరపు కింది భాగంలో ఉన్నది.  అన్నప్పుడు శరీరపు మధ్యభాగంలో ఉన్నది. మ్‌ అన్నప్పుడు పైభాగంలో ఉంటుంది. ఓం అన్నప్పుడు ప్రాణశక్తి శరీరమంతటా విస్తరించి, సంపూర్ణం అవుతుంది. నోటిలోని మూలభాగము నుండి అంత్యభాగము వరకు కూడా ఉచ్చారణ సమయములో దొర్లుకుంటూ ఉంటుంది. ఇలా శబ్ద ఉచ్చారణా ప్రక్రియనంతా "ఓం" కారం తెలియజేస్తూంది. ఓం శబ్దమే రూపాంతరం చెంది క్రైస్తవంలో ఆమెన్‌గా, ఇస్లాంలో అమీన్‌గా ఏర్పడ్డాయి. అందువలనే ఓంకారం అన్ని మతాలలోనూ అంగీకరింపబడింది. అన్ని మతాల ప్రార్థనల్లోనూ ఓంకారం గాని, దానికి దగ్గరగా ఉండే శబ్దం కానీ వినిపిస్తోంది. ఓం అనేది చైతన్యపు పూర్ణత్వానికి సమీపంగా వచ్చే శబ్దం.
ఉదాహరణకు బిడ్డ తన తల్లిని అమ్మా అని పిలువగానే, ఆ తల్లి ఎన్ని పనులతో సతమతమవుతున్నప్పటికి ఆప్యాయంగా ఆ బిడ్దను గుండెకు హత్తుకుంటుంది కదా! అలాగే సకల దేవత్తమూర్తులు, మంత్రోచ్చారణతో మనం మననం చేయగానే మన పట్ల ప్రసన్నులవుతున్నారు.
     
అసలు మంత్రం అంటే ఏమిటి?’ 

     మననాత్ త్రాయతేఇతి మంత్ర: అని అన్నారు. అంటే మననం చేయడం వలన రక్షించేది అని అర్ధం, అటువంటి మహా శక్తివంతమైన మంత్రాలను మన ఋషులు, తమ అమోఘ తపశ్శక్తితో, భగవదావేశంలో పలికిన వాక్యాలే మంత్రాలు.
     ఐం’, ‘శ్రీం’, ‘హ్రీం’, ‘క్లీంఅనే బీజాక్షరాలను అయా దేవతల పేర్లతో కలిపి జపించినపుడు శక్తివంతమైన మహామంత్రాలవుతాయి. మన్ ఇష్టదేవతను ప్రసన్నం చేసుకోవడమే మంత్రం యొక్క లక్ష్యం. ఈ మంత్రాలు మూడు విధాలు. క్షుద్రంతో ఉచ్చాటన చేసే తామస మంత్రాలు, యుద్ధంలో గెలుపు కోసం చేసే రాజలమంత్రాలు, ఆధ్యాత్మిక సాధనకై జపించే సాత్వికమంత్రాలు, చంధోబద్దంగా ఉన్నవి. ౠక్కులూ గద్యాత్మకంగా ఉన్న మంత్రాలుయజస్సులూ.

      ఇక అన్ని మంత్రాలకు ముందు ఓం కారాన్ని చేర్చి జపిస్తాం. ఎందుకంటే ఓం కారం లేని మంత్రం ఫలవంతం కాదు. అలాంటి మంత్రం ప్రాణవయువులేని నిర్జీవ శరీరం వంటిది. ఈ ఓంకారం ఆ సర్వేశ్వరుని మంచి ఓక జ్యోతిగా ప్రారంభమై, అందునుంచి ఒక నాదం ధ్వనించింది. ఆ ధ్వనే ఓంకారం. ఓం నుంచి వేదరాశులే ఉద్భవించాయి. గ్వేదంనుండి కారం, యజుర్వేదం నుండి కారం, సామవేదం నుండి కారం కలసి ఓంకారంఏర్పడిందని షివాక్కు. సకలవేదరూపం "ఓంకారం".

Comments

Popular Posts