మెడ చుట్టూ నల్లటి వలయాలు డయాబెటిస్ కు సూచనా?

మనం గాని ఒక సారి గుర్తుకు తెచ్చుకుంటే చాలా మంది పిల్లలకు మెడ మీద నల్లగా కొన్ని వలయాలు కా ఏర్పడతాయి. చాలా మంది తల్లులు అది సరిగ్గా స్నానం చేయకపోవడం వల్లే వస్తుందనుకోని,పిల్లలను స్నానం సరిగ్గా చేయమని తెగా తిడుతూ వుంటారు. ఇకపోతే తాజా జరిగిన పరిశోధనలో ఒక విషయం తేలింది. అదేమిటంటే మెడ మీద నల్లటి వలయాలు వుంటే టైప్ 2 డయాబీటిస్ వచ్చే అవకాశాలు వున్నాయట.

ఎందుకంటే శరీరంలో ఇన్సులిన్ లెవల్స్ అధికంగా వుంటే పిగ్మెంటేషన్ అధికంగా వుంటుందని వీరు తెలిపారు. సో మెడ మీద నల్లటి వలయాలు వుంటే ఒకసారి డయాబెటిస్ టెస్ట్ చేయుంచుకోవడం మేలు అంటున్నారు. అలా అని నల్ల వలయాలు వుంటే కచ్చితంగా డయాబెటిస్ వుందని అర్ధం కాదు అని తెలిపారు. వీలైనంతవరకు మెడ మీద నల్లటి వలయాలు వుంటే టైప్ 2 డయాబెటిస్ టెస్ట్ చేయించుకోవాలని వీరు సలహా ఇచ్చారు. కాబట్టి మీ పిల్లలలో ఒక వేళ ఈ సమస్య తో భాదపడితే ఉంటె ఖశ్చితంగా ఈ టెస్ట్ చేయుంచుకోవాలని వైద్యుల సూచన.

Comments

Popular Posts