ముల్లంగి-ప్రయోజనాలు

ముల్లంగిల మన ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం వాటి వల్ల ఉన్న ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
      ముందుగా మనం సన్నగా తరిగిన నాలుగు ముల్లంగి ముక్కలలో కొంచెం ఉప్పు, మిరియాల పొడి, నిమ్మరసం కలిపి తింటే మల బద్దకం, అజీర్తి, కడుపునొప్పి ఆకలి వంటి సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. ముల్లంగి ఆకులను నూరి రసం తీసుకుని రోజుకు ఒక కప్పు చొప్పున 15 రోజులు తాగుతే మూత్రకోశ వ్యాధులు నుంచి బయటపడతారు. అలాగే ముల్లంగిని మెత్తగా దంచి ఒక కప్పు రసంలో సమానంగా తేనె కలిపి రోజుకు మూసార్లు తాగితే దగ్గు తగ్గుతుంది. అదే విధంగా ఒక స్పూన్ ముల్లంగి గింజలను ఆవు పాలలో వేసి బాగా వేడి చేసి ప్రతిరోజు రాత్రి తాగాలి. ఇలా నెల రోజుల పాటు తాగితే పురుషులలో శ్రీఘ్ర స్కలనం సమస్య తగ్గుతుంది. ఒక కప్పు ముల్లంగి రసంలో మరో కప్పు ఆవాల నూనె కలిపి కాస్త వేడి చేయాలి. తర్వాత ఈ తైలాన్ని గోరు వచ్చగా చేసి ఉదయం, సాయంత్రం రెండు పూటలా 5,6 చుక్కలు చెవిలో వేసుకుంటే చెవి సమస్యలు తగ్గుతాయి. అంతేకాకుండా ముల్లంగి విత్తనాలను నిమ్మరసంలో కలిపి పలుచగా చర్మంపై పూస్తే చాలు దురదలు, దద్దుర్లు వెంటనే తగ్గిపోతాయి.

Comments

Popular Posts