సూర్యభగవానుడికి ఆదివారం రోజు గోధుమలు సమర్పిస్తే కలిగే ఫలితాలు..

సూర్యుని భగవానుడిగా ప్రార్థించటం మన ఆనవాయితీ. అదేసమయంలో ఆయన నవగ్రహాల్లో మాతృమూర్తిగా పరిగణించబడటం గమనార్హం. రెండు భుజాలతో పాటు ఆజానుబాహునిగా దర్శనమిస్తాడు. రథము ఇతని వాహనము. 

శిరస్సుపై స్వర్ణ మకుటం, మెడలో రత్నహారముండును. సూర్యుడు ఎరుపు రంగుకు పరిమితమైనవాడు. ఇతని రథానికి ఒకే చక్రము మాత్రమే వుంటుంది. అదే ఒక సంవత్సరంగా పరిగణింపబడుతుంది. 

దీనినుద్దేశించే పన్నెండు మాసాలు, ఆరుఋతువులు, నాలుగు మాసాల చొప్పున మూడు నాభిలు కలవు. వీనికి వెంట యక్ష, గంధర్వ, అప్సరస, నాగ, రాక్షస మండలి ఉపాసన జరుగుతుంది. చక్రము, పాశము, అంకుశము, శక్తి ఇతని ముఖ్య అస్త్రములు. రాశుల్లో సింహరాశికి అధిపతి నాధుడు. 

సూర్యుని దశాకాలము ఆరు సంవత్సరాలు. ఇతనిని శాంతింపజేయటానికి నిత్య సూర్యార్ఘ్యము సమర్పణ అవసరం. హరివంశపురాణాలు శ్రవించటం, మాణిక్యం ధరించటం, గోధుమలు, పాడియావు, బెల్లము, రాగిపాత్ర, సువర్ణము, ఎర్రని వస్త్రాలను బ్రాహ్మణులకు దానం చేయటం ద్వారా తృప్తి పరచటం చేయొచ్చు.

ఇతనిని ఆదిత్య అనే పేరుతో కూడ దేవతలు ఆశిస్తారు. సూర్యునకు "సవిత" అనే పేరు కూడ ఉంది. ఇతనికి అదితి దేవత (ఆదిత్య)అనే వేరొక పేరు కూడా కలదు. ఈ పేరు ఏర్పడటానికి కారణము దానవులు, రాక్షసులు, దేవతలతో యుద్దంలో జయించి వారి పదవులను అపహరిస్తారు.ఆ సమయాన దేవమాత అదితి సూర్యభగవానుని ప్రార్థిస్తుంది. సూర్యభగవానుడు ప్రసన్నంకావటం అదితి గర్భంలో జన్మించి, రాక్షసులను సంహరిస్తాడు. అనంతరం దేవతలను వారి వారి పదవుల్లో అలంకరింపజేస్తాడు. ఈ మార్గాన ఆయనకు ఆ పేరు సార్థకమైంది. 

అందుచేత సూర్య భగవానుడిని ఆది, సోమవారాల్లో పూజించిన వారికి సమస్త దోషాలు తొలగిపోయి, అనుకున్న కార్యాలు చేకూరుతాయి. సూర్యునికి ఆదివారం పూట గోధుమలు వంటి ధాన్యాలను సమర్పిస్తే సకలసంపదలు లభిస్తాయని జ్యోతిష్య నిపుణులు అంచనా వేస్తున్నారు.

Comments

Popular Posts