దేవుడి ముందు కొబ్బరికాయలను ఎందుకు కొడతారు?

ఆ భగవంతునికి మనం ఇచ్చే నివేదన ఎంతో పవిత్రంగా ఉండాలి. నిరంతరం మనల్ని రక్షించే ఆ భగవంతుడికి నిండైన మనస్సుతో ప్రార్థన చేయడమే ఆ స్వామికి మనం చేసే సేవ. ఏ ఆలయానికెళ్లినా మొదటగా ఆభగవంతుడికి సమర్పించేది టెంకాయ.. టెంకాయనే ఎందుకు ఇస్తామో తెలియకపోయినప్పటికి అందరూ ఇస్తున్నారు కదా మేము కూడా ఇస్తున్నామంటుంటారు. ఆ భగవంతునికి టెంకాయే ఎందుకిస్తామో ఇప్పుడు తెలుసుకుందాం. టెంకాయలోని నీరు ఏంతో పవిత్రమైనవి. ఎలాంటి కలుషితం లేకుండా తయారవుతాయి. వీటిలో ఎలాంటి కల్తీ వుండదు. టెంకాయ పైభాగం పీచుగా, పెంకు గట్టిగా, లోపల తెల్లటి కొబ్బరి మరియు నీళ్లు వుంటాయి. మనిషిలో ఉన్న అహంకారాన్ని దేవుడి దగ్గర వదిలివేయడానికి ప్రతీకగా చేసే చర్య కొబ్బరికాయ కొట్టడం. కొబ్బరికాయపై ఉన్న పెంకు మన అహంకారానికి ప్రతీక. మనలోని అహాన్ని నిర్మూలించేందుకు టెంకాయను కొట్టాలని పెద్దలు చెబుతారు. కొబ్బరికాయను కొడుతున్నామంటే, మన అహంకారాన్ని పూర్తిగా విడనాడి, లోపలున్న తెల్లని కొబ్బరిలా మన మనసును పవిత్రంగా మార్చుకున్నామని, నిర్మలమైన కొబ్బరినీరులా మన జీవితాలను ఉంచుకుంటామని దేవుడికి విన్నవించుకుంటున్నట్టు అర్థం.

      ఇదే కాకుండా తొలి పూజలందుకునే విఘ్ననాధుడైన వినాయకుడికి ఇష్టమైన పదార్థాలను కొబ్బరికాయలతోనే తయారుచేస్తారు. టెంకాయకున్న మూడు కళ్లు సాక్షాత్తు ఆ త్రినేత్రుడి నేత్రాలని భక్తులు విశ్వసిస్తారు. అందుకనే టెంకాయను మొదటగా దేవుడికి, ఏదైనా శుభకార్యం ముందు కొడుతుంటాం.

Comments

Popular Posts