అద్దె ఇంట్లో హోమాలు,యజ్ఞాలు చేయవచ్చా? చేస్తే ఫలితం దక్కుతుందా?

స్వగృహం...సొంత ఇల్లు అనేది విశేషమైనది. దైవకార్యక్రమాలు ,పుణ్యకార్యాలు చేయాలంటే.. ఆ పుణ్యకార్య ఫలితం పొందాలంటే స్వగృహంలోనే చేయాలి. లేకపోతే ఇంటి యజమానికి కొంత పుణ్యఫలం వెళ్ళిపోతుంది. అదే ఇంటి యజమాని మనమే అయితే మనం చేసిన పుణ్యకార్య ఫలితం పరిపూర్ణంగా మనకే లభిస్తుంది.దైవకార్యక్రమాలు, యజ్ఞాలు, హోమాలు అద్దె ఇంటిలో చేస్తే అది యజమానికి చేరుతుంది. అందుకే సొంతింటిలో సత్కార్యాలు చేసేందుకు ప్రయత్నించాలి. కాబట్టి ప్రతిబంధకాలను తొలగించుకుని.. ఆపై గృహసిద్ధి కోసం ప్రయత్నాలు చేయాలని.. తద్వారా సొంతింటి కల నెరవేరుతుందని పండితులు సూచిస్తున్నారు.


సొంత ఇల్లు ఏర్పరచుకోవడంలో  ఎదురయ్యే ప్రతిబంధకాన్ని తొలగించుకోవాలంటే ముందుగా దైవానుగ్రహం పొందాలి. గృహసిద్ధి సంకల్పం కోసం "ఓం క్షేత్రజ్ఞాయ నమః" అనే మంత్రాన్ని 108 సార్లు అసుర సంధ్యాకాలంలో పఠించాలి. అంటే సాయంకాలం పఠించాలి. ఆవునేతితో దీపమెలిగించి.. ఇష్టదైవం ముందు వుంచి 108 సార్లు పై మంత్రాన్ని పఠించాలి. ఇలా 48 రోజులు చేస్తే సొంతింటి కోరిక నెరవేరుతుందని పండితులు చెప్తున్నారు. 

Comments

Popular Posts