భగవంతునికి సమర్పించే ఏ ఏ నైవేద్యాలు ఎలాంటి ఫలితాలను ఇస్తాయి?

దేవునికి లడ్డూలను నైవేద్యంగా ఉంచితే ఇంట్లో శుభ కార్యాలు జరిగి అంతా శుభమే జరుగుతుంది. అందుకే తిరుమల శ్రీవారి ఆలయంలో లడ్డూలను స్వామివారికి ప్రధాన నైవేద్యంగా పెడుతున్నారని పురోహితులు చెబుతున్నారు. అలాగే దేవునికి భక్తులు ప్రసాద రూపంలో భక్ష్యాలను అందిస్తారు. 

వీటిలో లడ్డు, వడల హారం, జంతికల నైవేద్యం, రవ్వలడ్డు, అరిసెలను నైవేద్యంగా పెట్టడం ద్వారా మంచి ఫలితాలుంటాయి. ఇందులో భాగంగా దేవునికి బొబ్బట్లు నైవేద్యంగా ఉంచితే ఇంట్లో కుజ దోషాలున్న వారికి నివారణ కలిగి త్వరగా వివాహాలు జరుగుతాయి. చెగోడీలను నైవేద్యంగా ఉంచితే ఇంట్లో చాలా రోజులుగా ఆగిపోయిన పనులు వేగంగా జరుగుతాయి. 

దేవునికి వడల హారాన్ని లేదా గారెలను నైవేద్యంగా పెడితే ఇంట్లో అన్ని కలహాలు నివారణ అవుతాయి. దేవునికి రవ్వలడ్డు నైవేద్యంగా ఉంచితే ఆలోచనల వల్ల కలిగే తలనొప్పి, కంటికి సంబంధించిన మంటలు, ఎదనొప్పి, అధిక రక్తపోటు సాధారణ స్థితికి వస్తాయి. ఇంకా అప్పాలు లేదా అరిసెలను నైవేద్యంగా ఉంచితే పెద్దలు చేసిన పాపాలు తొలగిపోతాయి. 

దేవునికి దోసెను నైవేద్యంగా పెడితే ఇంట్లో శాంతి నెలకొంటుంది. అలాగే బెల్లం దోసెను నైవేద్యంగా ఉంచితే ఇంట్లో చక్కెర వ్యాధి ఉన్నవారు త్వరగా కోలుకుంటారు. చదువుకునే వారికి విద్య చక్కగా అబ్బుతుంది. మంచి జ్ఞాపకశక్తి పెరుగుతుంది. అలాగే దేవునికి శనగపిండి లడ్డు నైవేద్యంగా ఉంచితే బరువైన లోహాలు ఇనుప వ్యాపారం చేసేవారికి వ్యాపారం వృద్ధి చెందుతుందని పండితులు అంటున్నారు.

Comments

Popular Posts