శఠగోపం ఆకారం ఎందుకలా ఉంటుంది?

శఠగోపం ఆకారమే చాలా ప్రత్యేకంగా ఉంటుంది.గోపురాలు దాదాపు ఇదే ఆకారంలో ఉంటాయి. రాజమందిరాల పై భాగాలు ఇలా ఉండటం మనం గమనించవచ్చు..అలాగే చదరంగా ఉండే తలాలకన్నా వంపుగా అర్ధవృత్తాకారంలో (డోమ్‌ తరహా) నిర్మాణాలూ,ఆకారాలు  మన చుట్టూ ఉండే వివిధ రకాల శక్తులను ఒకచోటికి తెచ్చి, మనల్ని శారీరకంగానే కాకుండా మానసికంగానూ స్వస్థత కలిగేందుకు దోహదపడతాయని మన పూర్వీకులు,ప్రాచీన శాస్త్రవేత్తలు తెలిపారు.

శఠగోపం కూడా అచ్చంగా ఇదే విధంగా పనిచేస్తుంది. ఆత్మజ్ఞానానికి ప్రతీకైన సహస్రార చక్రం మన తలకు పై భాగంలో కాస్త ఎత్తులో ఉంటుంది.అలాంటి సహస్రార చక్రం పైన ఈ శఠగోపాన్ని ఉంచడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. శఠగోపాన్ని ఆరు అంగుళాలూ, ఎనిమిది అంగుళాలూ లెక్కన ఎత్తుగా చేయడం వెనక సహస్రార చక్ర స్థితి ముడిపడి ఉంది. మనం దేవాలయానికి వెళ్లినప్పుడు ఇన్ని రకాలుగా శక్తిని పొందుతాం కాబట్టి, దాన్ని స్థిరపరచుకోవడానికి కాసేపు అక్కడే కూర్చోమని చెబుతారు.
అలాగే,మనం ఈ మధ్య వింటూ ఉన్న పిరమిడ్‌ ధ్యానం, పిరమిడ్‌ థెరపీ లాంటివి కూడా ఈ తరహాలోనే పనిచేస్తాయి.


Comments

Popular Posts