పరమేశ్వరుడిని నందికొమ్ముల మధ్య నుంచి ఎందుకు దర్శిస్తారు?

పరమేశ్వరుడికి అనుంగుభక్తుడు నందీశ్వరుడు. అందుకనే ఆ లయకారకుడు నందిని తన వాహనంగా చేసుకున్నాడు. ప్రతి శివాలయంలోనూ శివలింగానికి ఎదురుగా నంది విగ్రహం ఉంటుంది. గురు, శిష్యుల మధ్య ఎవరూ వెళ్లకూడదు. అందుకనే నంది విగ్రహం పైన కొమ్ముల మధ్యనుంచి శివదర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. శంభుడు త్రినేత్రుడు. ఆయన త్రినేత్రం తెరిస్తే సకలా చరాచర జగత్తు తల్లడిల్లుతుంది అందుకనే నేరుగా శివుని ముందుకు వెళ్లకూడదని పెద్దలు చెబుతారు. దీంతో ముందుగా ఆయన వాహనమైన నంది కొమ్ములపై వేళ్లను ఆనించి దర్శనం చేసుకున్న అనంతరమే మందిరం లోపలికి వెళ్లాలి. దీన్నే శృంగదర్శనం అంటారు.


నంది వేద ధర్మ స్వరూపము. నంది మనలో పశుతత్వానికి నిదర్శనము. కొమ్ములు పట్టుకొని, వెనుక తోక వైపు చేయి పెట్టి కొమ్ముల మధ్య నుంచి స్వామిని చూస్తూ...'స్వామి...నేను నా పశుతత్వాన్ని అదుపులో పెట్టుకుంటాను. అందరికి మంచి చేస్తాను. న్యాయంగా ఉంటాను' అని విన్నవించి ఆపై చూడటమే పరమార్ధం.

Comments

Popular Posts