పూజ గదిలో దేవి-దేవతల ఫోటోలు,విగ్రహాలు ఎలా అమర్చుకోవాలి?

పూజ గదిని సాధ్యమైనంత వరకూ ఈశాన్య లేదా తూర్పు లేదా ఉత్తర దిక్కున ఏర్పాటు చేయాలి. తెల్లవారుఝామున సూర్యుడు ఇంటికి ఈశాన్య దిక్కున ఉండటం వల్ల ఇలా ఏర్పాటు చేసుకోవాలని వాస్తు కోవిదులు చెబుతారు.. హిందువులు తమ ఇళ్ళలో దేవీ-దేవతల ఫోటోలు పెట్టుకుంటారు. కొందరి ఇళ్ళల్లో ప్రత్యేకంగా పూజాగది ఉంటుంది. మరికొందరి ఇంట్లో గోడలకు దేవీ-దేవతల ఫోటోలు వ్రేలాడుతూ కనబడతాయి. అసలు ఈ దేవీ-దేవతల విగ్రహాలను కానీ, ఫోటోలు పెట్టుకోవడానికి కూడా ఒక వరుస క్రమం/పద్ధతి ఉందట.

      గణపతి దేవుని విగ్రహము లేదా పటము మధ్యలో అమర్చుకోవాలి. పురుష దేవతలు (ఉదా: హనుమంతుడు, శ్రీ కృష్ణుడు) గణపతికి కుడి వైపున, స్త్రీ దేవతలు(ఉదా : అన్నపూర్ణ దేవి) గణపతికి ఎడమ వైపున వచ్చే విధంగా అమర్చుకోవాలి. కొన్ని ఫోటోలలో దేవీ-దేవతల కలిసిన ఫోటోలు (ఉదా : సీతారాముడు, లక్ష్మి నారాయణుడు) వుంటాయి. అలాంటి ఫోటోలను గణపతి దేవునికి కుడి వైపు వచ్చే విధంగా అమర్చుకోవాలి. ఎవ్వరికైనా ఆధ్యాత్మిక గురువు ఉండి, కేవలము ఒక్కరే ఒంటరిగా నివసిస్తూ ఉంటె వారు గురువుల ఫోటోను మాత్రమే అమర్చుకోవాలి. ఒక్కవేళ కుటుంబ సభ్యులతో కలిసి జీవిస్తూ ఉంటే తమ గురువుల ఫోటోను గణపతి దేవునికి కుడి వైపున వచ్చే విధంగా అమర్చుకోవాలి.

Comments

Popular Posts