గుడిలో తీర్ధాన్ని మూడు సార్లు తీసుకుంటాము.ఎందుకు?


మనసా వాచా కర్మణా -ఈ మూడు గుణాలను కలిపి త్రికరణ శుద్ధి అని అంటారు. 
మనసా: ఆలయానికి వెళ్లినపుడు త్రికరణ శుద్ధిగా వ్యవహరించాలి. మనసు, వాక్కు, చేసేపని దైవంపై లగ్నం చేయాలి.
వాచా: మాట చేత భగవంతుడిని కీర్తించాలి.
కర్మణా: చేసే పని ఆధ్యాత్మికమైనదై ఉండాలి.
ఈ మూడు కర్తవ్యాలను బోధించడానికి మూడుసార్లు తీర్థం ఇస్తుంటారు.
అలాగే... 
1.     మొదటిసారి తీర్థం తీసుకుంటే శారీరక, మానసిక శుద్థి జరుగుతుంది. 
2.    రెండోసారి తీర్థం తీసుకుంటే న్యాయ ధర్మ ప్రవర్తనలు చక్కదిద్దుకుంటాయి.
3.    మూడవది పవిత్రమైన పరమేశ్వరుని పరమ పదం అనుకుని తీసుకోవాలి.
తీర్థం తీసుకునేటప్పుడు ఆరోగ్యకరమైన భావంతో తీసుకోవాలి.ఈ తీర్థం నాకు మంచి చేస్తుంది. నా ఆరోగ్యానికి, నా ఆధ్మాత్మికతను మెరుగు పరుస్తుంది అని సద్భావంతో తీసుకోవాలి. మూడుసార్లు కూడా కుడిచేయి కింద ఎడమచేయిని ఉంచి తీర్థం తీసుకోవాలి. కుడిచేయి చూపుడు వేలు మధ్యలోకి బొటన వేలిని మడిచి ఉన్న ముద్రతో తీర్థాన్ని తీసుకోవాలి.

భగవంతుడ్ని దర్శించి తీసుకునే తీర్ధంలో ఎన్నో ఆరోగ్య సుగుణాలు ఉంటాయి. శ్రీ గంధం, తులసి, పచ్చ కర్పూరమూ, కేసరి మొదలగు వాటిని భగవంతుడి తీర్ధంలో కలుపుతారు. ఈ తీర్ధంలో క్రిమి సంహరకంతో పాటు, రోగ నివారక గుణం కలగి ఉంటుంది. అందుకే భగవంతుడ్ని దర్శించాక  తీర్ధం తీసుకుంటే ఆధ్యాత్మిక భావనతో పాటు ఆరోగ్యం కూడా కలుగుతుంది.

                                 సమస్త పాప శమనం విష్ణుపాదోదకం శుభమ్||

మరో కారణం ధర్మార్థకామమోక్షాలలో.. మోక్షం ఆధ్యాత్మిక సాధన ద్వారా సిద్ధిస్తుంది. ధర్మార్థకామాలు భగవంతుడి ప్రసాదితాలు. దేవుడు ఈ మూడుఫలాలను భక్తులకు పరిపూర్ణంగా కటాక్షించాలని తీర్థం మూడుసార్లు ఇస్తారు.

                                 అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణమ్||


Comments

Popular Posts