నిద్రించేటప్పుడు రుద్రాక్షను ధరించవచ్చా?

మంత్రశక్తితో పవిత్రతను సంతరించబడిన రుద్రాక్షను ఆధ్యాత్మిక కార్యక్రమాలలో వాడతారు. సాక్షాత్తూ ఆ మహాశివుడి కన్నీళ్లనుంచి రుద్రాక్ష ఆవిర్భవించిందని అంటారు. ఈ రోజుల్లో, ఎంతో మంది జ్యోతిష్కులు అలాగే టీవీ ఛానల్స్ కూడా ఈ రుద్రాక్షల ప్రాముఖ్యత గురించి వివరిస్తున్నారు. జీవితంలోని అనేక సమస్యలను తొలగించే శక్తి రుద్రాక్షకుందని నమ్ముతారు.

చాలా మందికి రుద్రాక్ష ధారణ గురించి అనేక సందేహాలున్నాయి. వాటిలో, నిద్రించేటప్పుడు రుద్రాక్షను తీసివేయాలా? లేదా రుద్రాక్షను ధరించే నిద్రించవచ్చా? అనేది ప్రముఖమైనది. చాలా మంది నిద్రించేటప్పుడు రుద్రాక్షను తీసివేయాలని అంటారు. మరికొంతమంది, రుద్రాక్షను తీసివేయనవసరం లేదని వాదిస్తారు. అయితే, నిద్రకుపక్రమించే ముందు రుద్రాక్షను తీసివేయడం మంచిదని ఎక్కువ మంది విశ్వసిస్తారు. ఈ క్రింది విషయాలను పరిశీలిస్తే మీరు కూడా నిద్రించేటపుడు రుద్రాక్షను తీసివేయడం మంచిదన్న విషయం అర్థం చేసుకుంటారు.

రుద్రాక్షను నిద్రించేటప్పుడు ఎందుకు ధరించకూడదు:

1. రుద్రాక్ష ధారణ చేసిన వ్యక్తి పవిత్రంగా ఉండాలి. 
పగటి వేళలో, మీరు చేయబోయే పనులపై మీకు అవగాహనతో పాటు నియంత్రణ కూడా ఉంటుంది. ఏదైనా చెడు కర్మ చేయబోయినా మిమ్మల్ని ఆ పని చేయకుండా నియంత్రించుకోగల సామర్థ్యం పగటి వేళలో మీకుంటుంది. కానీ, నిద్రిస్తున్నప్పుడు అపస్మారకంగా ఉన్న మనసు మీద మీకు నియంత్రణ ఉండదు. పగటి వేళలో అణచివేతకు గురిచేయబడిన ఆలోచనలు నిద్రించే సమయంలో మిమ్మల్ని కలల రూపంలో పలకరిస్తాయి. అలా పగటివేళలో అణచివేతకు గురైన పగ, మొహం, అసూయ, దురాశ వంటి చెడు భావోద్వేగాలు మీ కలలో దర్శనమివ్వచ్చు. ఇవన్నీ మీరు ధరించిన రుద్రాక్ష యొక్క శక్తిని నశింపచేసి అపవిత్రం చేస్తాయి.

2. రుద్రాక్షలోనున్న శక్తిని నశింపచేసే అవకాశం మీ కలలకు ఉంది. 
రుద్రాక్షను ధరించి మీరు నిద్రించినప్పుడు, శృంగారానికి సంబంధించిన కలలు మీకొచ్చినట్లయితే మీరు ధరించిన రుద్రాక్ష అపవిత్రమైనట్లే మీరు భావించాలి. అలాగే, శృంగారంలో పాల్గొంటున్నప్పుడు కూడా మీరు రుద్రాక్షను ధరించకూడదు. కాబట్టి, రుద్రాక్షను మీ ఇంటిలోని పూజగదిలోని భద్రపరచండి.

3. ప్రతికూల శక్తి 
a) నిద్రించే సమయంలో మాత్రమే కాదు, మీరు అంత్యక్రియలకి స్మశానానికి వెళ్తున్నప్పుడు రుద్రాక్షను ఇంట్లో వదిలి వెళ్ళాలి. ఇంటికి రాగానే, తలస్నానం చేయాలి. తల భాగంలో అలాగే ఉదరం కింద భాగంలో మానవుని తేజస్సు అమితంగా ఉంటుంది. అందుకే స్నానపు నీటిలో కాసిన ఉప్పు వేసి ఆ నీటితో స్నానం చేయాలి. రుద్రాక్షను ధరించే ముందు మంత్రాన్ని జపించాలి. ఆ తరువాత రుద్రాక్షను ధరించాలి.

b) రుద్రాక్షను ధరించాక మాంసాహారాన్ని అలాగే మద్యపానాన్ని దూరంగా ఉంచాలి. ఒకవేళ మీరు దూరంగా ఉంచలేకపోతే కనీసం ఆ ఒక్క రోజుకు రుద్రాక్షను తీసివేసి పూజా మందిరంలో పెట్టాలి. ఆ మరునాడు, స్నానం చేసి మంత్రం జపం చేసి రుద్రాక్షను పవిత్రంగా ధరించాలి.

4. నిజానికి, కఠిన బ్రహ్మచర్యం పాటించే వారే రుద్రాక్షను ధరించాలి. వారు మాత్రమే నిద్రించే సమయంలో కూడా రుద్రాక్ష ధారణకు అర్హులు.

ఆధ్యాత్మికతకి మొట్టమొదటగా హృదయాన్ని మాలిన్యం నుండి శుభ్రం చేసుకోవడం ప్రధమం. మీకు శక్తులు రావడం మొదలయ్యాక మీరు వాటిని దుర్వినియోగం చేయకూడదు. ఇతరులకు హానీ తలపెట్టేందుకు మీరు మీ శక్తులను వినియోగించకూడదు.

కాబట్టి, మీరు నిద్రించే సమయంలో మీ మనస్సు అపస్మారకంగా మారే సమయంలో రుద్రాక్షను ధరించకండి. ఎందుకంటే, నిద్రలో మీరు మీ మనస్సును నియంత్రించలేరు కాబట్టి మీ కలలను మీరు నిర్దేశించలేరు. 


Comments

Popular Posts