వినాయకుడి విగ్రహాన్ని లేదా ఫోటోని ఇంటిలో, ఆఫీసులో ఇలా ఉంచుకుంటే సక్సెస్ మీదే.

· వినాయకుడికి హిందూ సంప్రదాయంలో చాలా ప్రాధాన్యత ఉంది. భక్తులు కోరుకునే సంపద, శ్రేయస్సు అందించే గొప్ప దేవుడు వినాయకుడు.
· హిందూ పురాణాల ప్రకారం.. ఏ పూజ అయినా, ఎలాంటి కార్యమైనా.. ముందుగా వినాయకుడిని పూజించడం ఆనవాయితీ. చాలామంది ఇంట్లో లేదా ఆఫీస్ లో వినాయకుడి విగ్రహం పెట్టుకుంటూ ఉంటారు. అయితే.. అయితే చాలామందికి ఎలాంటి విగ్రహం లేదా ఎలాంటి ఫోటో లేదా ఏ రంగు విగ్రహం, ఎక్కడ పెట్టుకోవాలి అనే విషయంలో సందేహాలు ఉంటాయి.
·  సరైన పద్ధతిలో, సరైన వాస్తు ప్రకారం వినాయకుడి విగ్రహం లేదా ఫోటోని పెట్టుకోవడం వల్ల.. పాజిటివ్ ఎనర్జీ మరింత పెరుగుతుంది. ఆ దేవుడి అనుగ్రహం మరింత మిన్నగా ఉంటుంది. సరైన ప్లేస్ లో వినాకుడి విగ్రహం పెట్టుకుంటే.. సంతోషం, సక్సెస్, సంపద జీవితంలో పొందుతారు. మరి ఎలాంటి విగ్రహం, ఎక్కడ పెట్టుకోవాలో తెలుసుకుందాము.
· ఆఫీస్ లో నిలబడి ఉండే వినాయకుడి విగ్రహాన్ని పెట్టుకోవాలి. ఇలాంటి విగ్రహం వర్క్ ప్లేస్ లో పెట్టుకోవడం వల్ల వర్క్ విషయంలో ఎనర్జీ, ఉత్సాహం పెరుగుతాయి.
·  కూర్చుని, తొండం ఆయన ఎడమ చేతివైపు తిరిగి ఉన్న వినాయకుడి విగ్రహం పెట్టుకుంటే.. సక్సస్ తో పాటు, అదృష్టం మీ సొంతమవుతుంది.
·  సంతోషం, ప్రశాంతత, ఐశ్వర్యం పొందాలనుకునేవాళ్లు తెలుపు వర్ణంలోని వినాయకుడి విగ్రహాన్ని లేదా ఫోటోని ఇంట్లో పెట్టుకోవాలి.
·  మీ పూజ గదిలో కేవలం ఒక వినాయకుడి విగ్రహాన్ని మాత్రమే పెట్టుకోవాలి. రెండు లేదా అంత కంటే ఎక్కువ వినాయకుడి విగ్రహాలను పెట్టుకుంటే.. ఆయన భార్యలైన బుద్ధి, సిద్ధిలకు ఆగ్రహం వస్తుంది.
· తమలో వృద్ధిని కోరుకునే వాళ్లు, సంపద పెరగాలని కోరుకునేవాళ్లు.. ఎరుపు, ఆరంజ్ కలిసిన (రెడిష్ ఆరంజ్) కలర్ వినాయకుడి విగ్రహాన్నిపూజించాలి.
· ఇంట్లో వాస్తు దోషంతో బాధపడేవాళ్లు.. వినాయకుడు, స్వస్తిక్ కలిసి ఉండే విగ్రహాన్ని లేదా ఫోటోని ఇంట్లో పెట్టుకోవాలి. అప్పుడు ఎలాంటి వాస్తు దోషమైనా తొలగిపోతుంది.
· వినాయకుడి వాహనం అయిన ఎలుక వినాయకుడి విగ్రహంతో పాటు ఉండేలా జాగ్రత్తపడాలి. ఇలా వినాయకుడితో పాటు, ఎలుక ఉన్న విగ్రహం ఇంట్లో పెట్టుకుంటే.. చాలామంచిది.

· వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన గరిక గడ్డిని.. వినాయకుడి విగ్రహానికి ప్రతిరోజూ సమర్పించాలి. ఇలా చేస్తే మీ కోరికలు నెరవేరుతాయి. అలా ఓం గం గణపతయే నమ: అనే మంత్రం జపించాలి.

Comments

Popular Posts