హెల్మెట్ ధరించడం వల్ల జుట్టు రాలిపోతోందా? ఈ చిట్కాలు మీ కోసం....

జుట్టు రాలడం మహిళల్ని కలవరపెట్టే సమస్య. జుట్టు రాలడానికి ఒకటి కాదు, రెండు కాదు వివిధ రకాల కారణాలున్నాయి. వాటిలో డైట్ సరిగా తీసుకోకపోవడం, తలస్నానానికి హార్డ్ వాటర్ వాడటం, మరియు జుట్టు ఆరోగ్యానికి సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల జుట్టు డ్రైగా మారుతుంది. అదే విదంగా జుట్టు రాలడానికి మరో కారణం కూడా ఉంది-హెల్మెట్ ధరించడం. టూవీలర్ నడిపే వారు హెల్మెట్ తప్పక ధరించాలనేది మనం తప్పనిసరిగా పాటించాల్సిన రూల్. ఇలాంటి పరిస్థితిలో మహిళల్లో హెల్మెట్ ధరించడం వల్ల జుట్టు మరింత ఎక్కువగా రాలిపోవడం కూడా జరగుతుంది. బైక్ నడిపే మహిళలకు కూడా ఈ జుట్టు రాలే సమస్యను ఎదుర్కొంటారు. ఈ జుట్టు రాలే సమస్యలను నివారించడానికి, కొన్ని పరిష్కార మార్గాలున్నాయి . వీటిని ఉపయోగించడం వల్ల హెల్మెట్ ధరించడం వల్ల రాలే జుట్టును అరికట్టవచ్చు. ఈ హోం రెమెడీస్ ఉపయోగించడం వల్ల హెల్మెట్ ధరించినా, జుట్టు రాలకుండా నివారించుకోవచ్చు. 

అన్నిటికంటే ముందుగా తలకు కాటన్ క్లాత్ ను చుట్టుకొని, హెల్మెట్ ను ధరించాలి. ఇలా చేస్తే హెయిర్ ఫాల్ ఉండదు .

హోం రెమెడీస్ 

నిమ్మరసంతో :
హెల్మెట్ ధరించడం వల్ల రాలే జుట్టును నివారించడానికి నిమ్మరసం గ్రేట్ గా సహాయపడుతుంది. మీ జుట్టుకు షైనింగ్ అందివ్వడానికి, మీ జుట్టును నిమ్మరసం తో శుభ్రం చేసుకోవడం వల్ల తలలో దురద మరియు డ్రైనెస్ నివారించబడుతుంది.

వెనిగర్ బాత్:
హెల్మెట్ ధరించిన తర్వాత అతి కొద్ది సమయంలోనే హెయిర్ డల్ గా ..నిర్జీవంగా మారడం మరియు హెయిర్ ఫాల్ జరుగుతుంది. కాబట్టి, మీ నిర్జీవమైన జుట్టుకు వెనిగర్ తో స్నానం చేస్తే మీ జుట్టుకు నేచురల్ గానే మంచి షైనింగ్ ను అందిస్తుంది.

జుట్టు పెరుగుదలకు ఉల్లిపాయ రసం:
ఉల్లిపాయ రసంలో జుట్టు పెరుగుదలకు సహాయపడే రహస్యాలెన్నో ఉన్నాయి. నాణ్యమైన షాంపుతో తలస్నానం చేసి, ఉల్లిపాయ రసాన్ని కండీషనర్ గా అప్లై చేయాలి. ఉల్లిరసాన్ని నేరుగా తలకు అప్లై చేసి 15నిముషాల తర్వాత ప్లెయిన్ వాటర్ తో శుభ్రం చేసుకోవాలి. ఈ ట్రీట్మెంట్ ను వారానికొకసారి ఫాలో అయితే చాలు మీరు రోజూ హెల్మెట్ ధరించుకోవచ్చు . ఈ హోం రెమెడీ హెయిర్ ఫాల్ ను తగ్గిస్తుంది .

బాదం నూనె:
బాదం నూనెతో తలకు మసాజ్ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. హెయిర్ ఫాల్ తగ్గించుకోవడానికి బాదం నూనెను వారంలో రెండు సార్లు అప్లై చేయాలి. బాదం ఆయిల్ లోని  విటమిన్ ఇ జుట్టుకు నేచురల్ షైన్ ను అందిస్తుంది.

వెల్లుల్లి:
జుట్టుకు వెల్లుల్లి గ్రేట్ గా పనిచేస్తుంది. జుట్టురాలడం నివారించడానికి వెల్లుల్లి గ్రేట్ గా సహాయపడుతుంది. హాట్ ఆయిల్లో కొద్దిగా వెల్లుల్లి రెబ్బలను వేసి నూనెలో మిక్స్ చేయాలి, దీన్ని తలకు పట్టించి మసాజ్ చేయాలి. వెల్లుల్లి జుట్టు పెరుగుదలను వేగంగా పెంచుతుంది మరియు జుట్టును స్ట్రాంగ్ గా మార్చుతుంది.

నేచురల్ షాంపు:
హెయిర్ ఫాల్ తగ్గించడంలో నేచురల్ షాంపు గ్రేట్ గా పనిచేస్తుంది. హోం మేడ్ యాంటీ డాండ్రఫ్ షాంపు, యాంటీ హెయిర్ ఫాల్ షాంపును ఉపయోగించడం వల్ల ఫలితాన్ని మీరే గమనించవచ్చు. వారంలో రెండు సార్లు హెయిర్ వాష్ వల్ల హెయిర్ డ్యామేజ్ ను అరికట్టవచ్చు.

పండ్లతో పోషణ:
విటమిన్ సి అధికంగా ఉండే ఫ్రూట్స్ తో జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఆమ్లా, మరియు ఆరెంజ్, నిమ్మరసం మిక్స్ చేసి అందులో జోజోబా ఆయిల్ మిక్స్ చేసి తలకు పట్టించడం వల్ల వారంలో మూడు సార్లు పట్టిస్తే జుట్టు రాలడాన్ని తగ్గించుకోవచ్చు.

Comments

Popular Posts