ఈ మంత్రానికి సొంత ఇంటి కల ను నేరేవేర్చే శక్తి ఉందట.

కొంతమంది  సొంతింటి నిర్మాణం కోసం లక్షలు ఖర్చు పెట్టేందుకు సిద్ధమైనా  కూడా  ఏదో ఒక అడ్డంకి వస్తూ ఉంటుంది. చేసే ప్రయత్నాలు బెడసికొడుతుంటాయి. అనుకూల పరిస్థితులు.. ముహూర్తఫలం.. సంకల్పం వంటివి అనుకూలిస్తే.. సొంతింటి కల నెరవేరుతుంది. 

కొందరికి మాత్రం సొంతిల్లు నిర్మించాలి లేదా కొనాలనే ప్రక్రియ కలగానే మిగిలిపోతుంది. అలాంటివారు గృహసిద్ధి కోసం ఏం చేయాలంటే? ముందుగా ప్రతిబంధకాలను తొలగించుకోవాలి. జాతక ప్రకారం గురుగ్రహ స్థితిగతులను పరిశీలించాలి. జాతకంలో చతుర్థాభావం (నాలుగోస్థానం)లో ఎలాంటి దోషాలు లేకుండా చూసుకోవాలి. గృహసిద్ధికి కారకుడైన గురుభగవానుడి అనుగ్రహం పొందాలి. ఇంకా చతుర్థాభావం దోషాలు లేకుండే విధంగా చూసుకోవాలి. ఈ రెండు అనుకూలిస్తే గృహసిద్ధి సులభమవుతుంది. ఈ రెండింటి అనుగ్రహం లేకపోతే.. ఇంటి కల నెరవేరదు. 


ఈ ప్రతిబంధకాన్ని తొలగించుకోవాలంటే ముందుగా దైవానుగ్రహం పొందాలి. గృహసిద్ధి సంకల్పం కోసం
"ఓం క్షేత్రజ్ఞాయ నమః" అనే మంత్రాన్ని 108 సార్లు అసుర సంధ్యాకాలంలో అంటే సాయంకాలం పఠించాలి. ఆవునేతితో దీపమెలిగించి.. ఇష్టదైవం ముందు వుంచి 108 సార్లు పై మంత్రాన్ని పఠించాలి. ఇలా 48 రోజులు చేస్తే సొంతింటి కోరిక నెరవేరుతుందని పండితులు చెప్తున్నారు. 

Comments

Popular Posts