ఒకే రాశికి చెందిన స్త్రీ, పురుషులు వివాహం చేసుకోవచ్చా?

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం దంపతులిద్దరు వేర్వేరు రాశులకు చెందినవారై ఉండటం శ్రేయస్కరమని నిపుణులు చెపుతున్నారు. అలాగాకుండా భార్యాభర్తలిద్దరూ ఒకేరాశిలో జన్మించిన జాతకులైతే.. గ్రహస్థితులు సక్రమంగా లేని సమయంలో అంటే అష్టమ శని, ఏలినాటి శని ఆధిపత్యంతో విభేదాలకు దారితీసే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. 
ఇదేవిధంగా.. ఒకేరాశికి చెందిన భార్యాభర్తల మధ్య.. రాహుకేతుదశ కాలంలో "అహం" అనే భూతంతో పలు సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. అయితే ఒకే రాశికి చెందిన దంపతులకు వ్యక్తిత్వ మనస్తత్వం, భావాలు సరితూగడంతో కొన్ని సమస్యలు దూరమవుతాయి. కానీ భార్యాభర్తలు వారానికి ఒకసారైనా వివాదానికి దిగుతారని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.

ఇలా భార్యాభర్తల మధ్య ఏర్పడే చిన్నచిన్న వివాదాలు పెనుప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని, అందుచేత ఒకే రాశికి చెందిన స్త్రీ, పురుషులు వివాహం చేసుకోకపోవడం జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. 

ఒకవేళ ఒకే రాశిలో పుట్టిన స్త్రీ, పురుషులు దంపతులై ఉంటే.. గ్రహస్థితి సరిగ్గా లేని సమయంలో జ్యోతిష్య నిపుణుల సూచనల మేరకు పరిహారాలు జరిపించడం మంచిది. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. 


అంతేగాకుండా..  ఒకేరాశిలో జన్మించిన దంపతులు అష్టమశని, ఏలినాటి శని సమయంలో శనీశ్వరునికి తైలాభిషేకం చేయించడం, శనివారం పూట నువ్వులనూనెతో దీపమెలిగించడం వంటివి చేస్తే సమస్యలు దరిచేరవని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.

Comments

Popular Posts