డార్క్ లిప్స్ (నల్లబడిన పెదవులు) ను తిరిగి పింక్ కలర్ లోకి మార్చుకోవడం ఎలా?

పెదవులు నల్లబడటానికి( డార్క్ లిప్స్) ప్రధాన కారణాలు:
ఎక్కువగా సూర్య రశ్మికి గురిఅవ్వడం, లేదా అలెర్జిక్ రియాక్షన్ లేదా తక్కువ నాణ్యత కలిగిన కాస్మొటిక్స్ ఉపయోగించడం లేదా టుబాకో నమలడం ఎక్కువగా సిగరెట్స్ కాల్చడం లేదా అధిక మొత్తంలో కెఫిన్ తీసుకోవడం, మరియు హార్మోనుల అసమతులత్య.

ఖరీదైన ఉత్పత్తులను ఉపయోగించకుండానే డార్క్ లిప్స్ ను లైట్ గా మార్చుకోవడం లేదా, నలుపును నివారించడానికి అనేక సహజమైన మార్గాలు ఉన్నాయి.
నిమ్మ: నిమ్మరసము స్కిన్ ప్యాచ్ లను మరియు డార్క్ స్పాట్స్ ను నివారించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే డార్క్ లిప్స్ నివారించడానికి కూడా ఉపయోగించవచ్చు. నిమ్మరసంలోని బ్లీచింగ్ లక్షణాలు డార్క్ లిప్స్ మీదా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి.
నిమ్మరసాన్ని నిద్రించే ముందు పెదాల మీద రుద్దాలి. ఈ సింపుల్ రెమెడీని రెండు నెలలు క్రమం తప్పకుండా అనుసరించండి. నిమ్మ తొక్క మీద ఉప్పు లేదా షుగర్ చిలకరించి పెదాల మీద రుద్దాలి. ఇది డెడ్ స్కిన్ సెల్స్ తొలగిస్తుంది. దాంతో పెదాల మీద కొత్త చర్మం కనబడుతుంది. ఈ రెమెడీని క్రమం తప్పకుండా కొన్ని వారాలు చేయండి.

రోజ్: రోజ్ సున్నితత్వం, చల్లదనం మరియు మాయిశ్చరైజింగ్ వంటి గుణాలు కలిగి ఉంటుంది. రోజ్ డార్క్ లిప్స్ ను పింక్ కలర్ లోకి మార్చడానికి అద్భుతంగా సహాయపడుతుంది.
ఒక చుక్క రోజ్ వాటర్ లో కొద్దిగా తేనె మిక్స్ చేసి, పెదాలకు అప్లై చేయాలి . ఇలా రోజుకు మూడు, నాలుగు సార్లు చేయాలి.
గులాబీ రేకులను పేస్ట్ లా చేసి అందులో ఒక చెంచా బట్టర్, తేనె, పాలు వేసి క్రీమ్ లా చేయాలి. దీన్ని పెదాలకు అప్లై చేసి నిధానంగా రుద్దాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చాలు.

ఆలివ్ ఆయిల్: ఇది మాయిశ్చరైజింగ్ గా పనిచేసి, పెదాలను సున్నితంగా మరియు బ్యూటిఫుల్ గా మార్చుతుంది. ఆలివ్ ఆయిల్ ను కొన్ని చుక్కలు పెదాల మీద వేసి మసాజ్ చేయాలి. నిద్రించే ముందు ప్రతి రోజూ రెగ్యులర్ గా ఇలా చేయాలి.
పంచదార: పంచదారను మెత్తగా పౌడర్ చేసి అందులో రెండు చెంచాల బట్టర్ వేసి మెత్తగా పేస్ట్ చేసి, ఈ మిశ్రమాన్ని పెదాల మీద రుద్దాలి. ఇలా వారానికొకసారి చేయాలి.

బీట్ రూట్:బీట్ రూట్ లో నేచురల్ బ్లీచింగ్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది డార్క్ లిప్స్ ను లైట్ చేస్తుంది. తాజాగా ఉండే బీట్ రూట్ ముక్కలను పెదాల మీద రుద్దాలి. లేదా బీట్ రూట్ రసాన్ని నిద్రించే ముందు గా అప్లై చేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేయాలి. బీట్ రూట్ లోని నేచురల్ రెడ్ కలర్ డార్క్ లిప్స్ ను పింక్ గా మార్చుతాయి.

దానిమ్మ:పొడిబారిన మరియు తేమకోల్పోయిన పెదాలకు తగినంత తేమను అందించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే పింక్ కలర్ ను రిస్టోర్ చేస్తుంది. *దానిమ్మ గింజలను మెత్తగా పేస్ట్ చేసి అందులో కొద్దిగా మిల్క్ క్రీమ్ మరియు రోజ్ వాటర్ వేసి మిక్స్ చేసి పెదాలకు అప్లై చేసి, కొద్దిసేటి తర్వాత రుద్దాలి. గోరువెచ్చని నీటితోశుభ్రం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

కీరదోస: కీరదోసకాయముక్కను తీసుకొనే పెదాల మీద నిధానంగా రుద్దాలి. ఇలా ప్రతి రోజూ 5నిముషాలు చేస్తే చాలా
మంచి
 ఫలితం ఉంటుంది .

తేనె: తేనె ఒక నేచురల్ మాయిశ్చరైజర్ ఇది పెదాలను సున్నితంగా చేస్తుంది మరియు నేచురల్ గా పింక్ కలర్ లోకి మార్చుతుంది. ప్రతి రోజూ నిద్రించే ముందు తేనెను పెదాల మీద అప్లై చేయాలి. రాత్రంతా అలాగే ఉంచి, తర్వాత ఉదయం శుభ్రం చేసుకోవాలి గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. దీన్ని రెగ్యులర్ గా చేసి పెదాలను పింక్ కలర్ లోనికి
మారుతాయి.


బాదాం ఆయిల్: డార్క్ లిప్స్ కు మరో హోం రెడీ బాదం ఆయిల్. ఇది పెదాలను సున్నితంగా మరియు మాయిశ్చరైజ్ గా చేస్తుంది. బాదం నూనెను కొద్దిగా వేసి, అందులో తేనె మిక్స్ చేసి పెదాల మీద అప్లై చేయాలి. కొన్ని రోజుల్లోనే మీ పెదాలు సాఫ్ట్ గా మరియు స్మూత్ గా మారుతాయి. నేచురల్ పింక్ కలర్ కి మారుతాయి.

Comments

Popular Posts