కురుక్షేత్ర యుద్ధానికి ముందే పాండవులు మరణించారా?

భారతీయ పురాణాల్లో ఎన్నో ఆసక్తిమైన విషయాలు దాగి ఉన్నాయి. భూమిపైన నిధి సంరక్షకులుగా యక్షుని, యక్షులు గురించి పురాణ కథల్లో చెప్పకుంటారు. ఇది కేవలం హిందూ మతానికే పరిమితం కాలేదు. బౌద్ధం, జైన మతాల్లోనూ వీరి ప్రస్తావన ఉంది. వీటిలో కొన్ని ఊహలు ఉన్నా కానీ మంచి దాగి ఉంది. సంపదలకు అధిపతి అయిన కుబేరుడు కూడా యక్షుడే.

మహాభారతంలోని అరణ్య పర్వంలో ఓ కీలక సంఘటనకు యక్షుడు సాక్షిగా నిలిచాడు. కౌరవులతో మాయా జూదంలో ఓడిపోయిన పాండవులు పన్నెండేళ్లు వనవాసం, ఏడాది అఙ్ఞాత‌ వాసం చేస్తారు. అరణ్యవాసం సమయంలోనే ధర్మరాజు తప్ప భీముడు, అర్జునుడు, నకులుడు, సహాదేవుడు మరణించారట. అడవిలో బంగారు జింకను వేంటాడుతూ బాగా అలసిపోయి, దాహంతో అలమటిస్తున్న యుధిష్ఠరుడు తన సోదరుడు నకులుడిని నీళ్లు తెమ్మని కోరుతాడు. దీంతో నకులుడు నీటి కోసం వెదకుతూ ఓ నది దగ్గరకు వెళతాడు.

ఆ నదిలో నీటిని తీసుకోడానికి వంగిన ఆయనను ఓ కొంగ ఇలా హెచ్చరించింది. అక్కడ కాపలా ఉన్న యక్షుడి ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వకపోతే నీరు విషంగా మారుతుందని పలికింది. కొంగ మాటలను పట్టించుకోని నకులుడు నీళ్లు తగిన మరుక్షణమే మరణిస్తాడు. నీటి కోసం వెళ్లిన నకులుడు ఎంతకూ తిరిగి రాకపోవడంతో అతడిని వెదకడానికి సహదేవుడు, అర్జునుడు, భీముడు ఒకరి తర్వాత ఒకరు వెళ్తారు.


వీళ్లు కూడా రాకపోవడంతో కలవరపడిన ధర్మరాజు చివరిగా ఆ ప్రదేశానికి చేరుకుంటాడు. అక్కడ మరణించిన ఉన్న తన సోదరులను చూసి ఏం జరిగిందో తెలుసుకుంటాడు. దీంతో యక్షుడిని ప్రశ్నలు అడగమని కోరతాడు. అంతే కాదు నేను చెప్పే సమాధానాలతో సంతృప్తి చెందితే సోదరులను తిరిగి బతికించాలని అంటాడు. అప్పుడు యక్షుడు ప్రశ్నలు సంధిస్తాడు.

1. యక్షుడు: మానవులకు వింతైనది ఏంటి?
ధర్మరాజు: తాము ఎప్పటికైనా చనిపోతామని తెలిసినా మానవుడు దాని కోసం ఆందోళన పడటం.

2. యక్షుడు: ప్రపంచంలో ఎక్కువ సంఖ్యలో ఉండేవి?
ధర్మరాజు: మనిషి ఆలోచనలు.

3. యక్షుడు: సంపద ఎక్కడ కొలువుంటుంది, దాని వల్ల గొప్ప ఒరిగే లాభం ఏంటి?
ధర్మరాజు: విద్య అనేది గొప్ప సంపద, దీని వల్ల ఆరోగ్యం సొంతమవుతుందని ధర్మరాజు తెలిపాడు.

4. యక్షుడు: భయంకర విషం ఏది?
ధర్మరాజు: కామం లేదా వ్యామోహం నిజమైన విషం.

5. భూమి కంటే బరువైనవారు, స్వర్గం కంటే గొప్పవారు ఎవరు?
ధర్మరాజు: తన బిడ్డల కోసం భక్తిపూర్వకంగా త్యాగం చేసే అమ్మ భూమిపై అన్నికంటే బరువైనది. పిల్లల జీవితం కోసం నిరంతరం శ్రమించే తండ్రి స్వర్గం కంటే గొప్పవాడు.

6. యక్షుడు: గాలి కంటే వేగమైనది ఏది?
ధర్మరాజు: మనసు

ధర్మరాజు చెప్పిన సమాధానాలకు సంతృప్తి చెందిన యక్షుడు మరణించిన వారికి తిరిగి ప్రాణదానం చేస్తాడు.

Comments

Popular Posts