సూర్యుడు కలలో కనిపిస్తే....

కలలకు ఓ అర్థం ఉంటుందంటారు జ్యోతిష్య నిపుణులు. సూర్యుడు సముద్రం నుంచి పైకి వస్తున్నట్లుగా... అంటే సూర్యోదయం అవుతున్నట్లుగా కలగంటే అనుకున్న పనులు నెరవేరతాయట. క్షేమం సంప్రాప్తిస్తుందని చెపుతారు. 
సూర్యాస్తమయం కనిపించినట్లయితే కీడు, అపనిందలు, వ్యాపార నష్టం కలుగుతుంది. ఇంకా సూర్య కిరణాలు పక్క మీద పడుతున్నట్లు కలగంటే అనారోగ్యం. తమ గది మొత్తం సూర్యకాంతితో ప్రకాశిస్తున్నట్లు కలగంటే ధనలాభం, గౌరవం, సంతాన లాభం కలుగుతుంది.
నేరస్థులకు తమ చుట్టూ సూర్యకిరణాలు చుట్టుకొన్నట్లు కలగంటే వారు జైలు నుంచి విడుదలవుతారని వారు చెబుతున్నారు..

Comments

Popular Posts